Diabetes: డయాబెటిస్ బాధితులకు అలర్ట్.. అలాంటి చపాతీ పిండితో మీ షుగర్ లెవల్స్ పెరుగుతుందని మీకు తెలుసా..?
చిన్నపాటి పొరపాటు కూడా పెను ప్రమాదానికి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువ కాలం ఉంటే, అది ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండెపై ప్రభావం చూపుతుంది.
డయాబెటిస్ బాధితులు తమ ఆహారంలో ఏం తినాలి..? ఏం తినకూడదు..? అనే విషయాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. చిన్నపాటి పొరపాటు కూడా పెను ప్రమాదానికి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువ కాలం ఉంటే, అది ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండెపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే చాలా మంది ప్రజలు తమ ఆహారంలో గోధుమలను చేర్చుకుంటారు. మధుమేహాన్ని నివారించటం కోసం ఎక్కువగా గోధుమ పిండితో చేసిన చపాతీ తింటారు. ఇలా చాలా మందికి గోధుమ పిండితో చపాతీ చేసేటపుడు పిండిని పిసికే అలవాటు ఉంటుంది. ఇలా పట్టిన పిండిలో మిగిలేది మైదా అని చాలా మందికి తెలియదు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది విషం లాంటిది. అలాగే గోధుమ పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల గోధుమ పిండితో చేసిన చపాతీలు తింటే రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి పిండితో తయారు చేసిన రోట్టెలు తినాలో ఇక్కడ తెలుసుకుందాం..
మొక్కజొన్న పిండి : మధుమేహ వ్యాధిగ్రస్తులు మొక్కజొన్న పిండితో చేసిన చపాతీలను తీసుకోవడం మంచిది . మొక్కజొన్న పిండితో చేసిన రొట్టెలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మొక్కజొన్నలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది కాకుండా, ఇందులో ప్రోటీన్, మెగ్నీషియం కూడా ఉన్నాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
శనగపిండి: శనగపిండితో చేసిన చపాతీలు కూడా మధుమేహ రోగులకు మేలు చేస్తుంది. ఈ పిండి గ్లూటెన్ ఫ్రీ. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
రాగి పిండి: రాగులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మధుమేహ రోగులకు ఇది మేలు చేస్తుంది. ఈ పిండి ప్రత్యేకత ఏమిటంటే దీన్ని తింటే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఇది కాకుండా, ఈ పిండి బరువు నిర్వహణలో కూడా సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.