Health Tips: నిర్ణీత సమయం నిద్రపోకపోతే.. భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..

ఓ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. నిర్ణీత సమయం నిద్రపోవడం అంతే ముఖ్యం. ఎక్కువ సమయం నిద్రపోతే ఎంత ప్రమాదమో.. నిర్ణీత సమయం నిద్రపోకపోయినా అంతే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న సాంకేతికత, విపరీత..

Health Tips: నిర్ణీత సమయం నిద్రపోకపోతే.. భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Sleeplessness Upto Late Night
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 29, 2022 | 9:56 AM

ఓ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. నిర్ణీత సమయం నిద్రపోవడం అంతే ముఖ్యం. ఎక్కువ సమయం నిద్రపోతే ఎంత ప్రమాదమో.. నిర్ణీత సమయం నిద్రపోకపోయినా అంతే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న సాంకేతికత, విపరీత ధోరణుల కారణంగా నిద్రపోయే వేళల్లో విశేష మార్పులు వస్తున్నాయి. అర్ధరాత్రి వరకు మేల్కొవడం,  పొద్దెక్కాక నిద్రలేవడం ప్రస్తుత రోజుల్లో సాధారణమైపోయింది. ఫలితంగా ఎన్నో రకాల జబ్బులు చుట్టుముడుతున్నాయి. పిల్లల నుంచి మొదలు పెడితే పెద్ద వాళ్ల వరకూ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్యను అంత తేలిగ్గా తీసిపారేయకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు  తీవ్ర ముప్పు కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడి, డిప్రెషన్ వంటి అనేక కారణాల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. వర్క్ చేయడం, టీవీ, ఫోన్ చూడడం వంటి కారణాల వల్ల పడుకునే సమయం పూర్తిగా తగ్గిపోయింది. దీనివల్ల ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తోంది. సరైన సమయానికి నిద్రపోయే వారు చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా రోజుకు కనీసం 6 నుంచి 9 గంటల నిద్ర కచ్చితంగా అవసరం.

రోజులో ఎక్కువ సమయం మెలకువగానే ఉంటే.. ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ఈ కారణాల వల్ల రోజు వారి పనులను సక్రమంగా చేసుకోలేరు. కంటికి కనుకు దూరమైతే జీవ గడియారం దెబ్బతినే ప్రమాదం ఉంది. నిద్రలేమితో రక్తప్రసరణ వేగం తగ్గుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. సమయానికి నిద్రపోకపోతే ఒత్తిడి పెరిగి పూర్తిగా నిరాశలో కూరుకుపోతున్నారని ఓ సర్వేలో తేలింది. సరిగా నిద్రలేకపోతే విపరీతంగా బరువు ఊబకాయం సమస్య తలెత్తుంది.

సరైన సమయానికి నిద్రపోతే ఒత్తిడి, నిరాశ వంటివి దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. పనులు సులభంగా చేసుకోవచ్చు. మెదడుపై ఒత్తిడి తగ్గి, మెరుగైన ఆరోగ్యం కలుగుతుంది. నిద్రపోయేందుకు ఒక టైం టేబుల్ ను సిద్దం చేసుకుంటే జీవ గడియారం మెరుగ్గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..