AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banana: అరటి పండ్లపై నల్లటి మచ్చలున్నాయని వదిలేస్తున్నారా.? అయితే మీరు చాలా కోల్పోతున్నట్లే..

అరటి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే పండ్లలో అరటిదే అగ్ర స్థానం. అయితే అరటి పండ్ల ఎంపికలో చాలా మంది పండ్లు పచ్చగా ఉండాలని చూస్తుంటారు. నల్లమచ్చలున్న వాటిని వదిలేస్తుంటారు. చాలా మంది..

Banana: అరటి పండ్లపై నల్లటి మచ్చలున్నాయని వదిలేస్తున్నారా.? అయితే మీరు చాలా కోల్పోతున్నట్లే..
Narender Vaitla
|

Updated on: Dec 29, 2022 | 9:44 AM

Share

అరటి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే పండ్లలో అరటిదే అగ్ర స్థానం. అయితే అరటి పండ్ల ఎంపికలో చాలా మంది పండ్లు పచ్చగా ఉండాలని చూస్తుంటారు. నల్లమచ్చలున్న వాటిని వదిలేస్తుంటారు. చాలా మంది దృష్టిలో నల్లటి మచ్చలున్న అరటి పండ్లు పాడైనవిగా భావిస్తుంటారు. అయితే నిజానికి నల్లటి మచ్చలు ఉన్న అరటి పండ్లే ఆరోగ్యానికి మేలు చేస్తాయని మీకు తెలుసా.? అంతేకాకుండా మాములు అరటి పండ్ల కంటే కాస్త బాగా పండిన పండ్లే ఆరోగ్యానికి మంచివని నిపునులు చెబుతున్నారు. ఇంతకీ నల్ల మచ్చలున్న అరటితో కలిగే లాభాలేంటో ఓ లుక్కేయండి..

నల్లటి మచ్చలున్న అరటి పండ్లను తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. అరటి పండు పండే కొద్దీ అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్థాయి మరింత పెరుగుతుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో సహాయపడుతుంది. బీపీని అదుపులో ఉంచుతుంది, ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది. అయితే నల్లమచ్చలు లేని అరటిలో పొటిషియం తక్కువగా సోడియం ఎక్కువగా ఉంటుంది. నల్ల మచ్చలతో కూడిన అరటిపండులో ఉండే యాంటీ యాసిడ్ గుణాలు ఎసిడిటీని తగ్గిస్తాయి. గుండెల్లో మంట తగ్గుతుంది. నల్ల మచ్చలున్న అరటి 8 రెట్లు ఎక్కువ ఆరోగ్యకరమని జపాన్‌ పరిశోధకులు కనుగొన్నారు.

రక్త హీనత బాధపడేవారికి నల్ల మచ్చలున్న అరటి పంట్డు ఎంతగానో ఉపయోగపడుతాయి. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ఇలాంటి అరటి మంచి ఔషధంగా పనిచేస్తుంది. రక్త హీనతను అరటిని వైద్యులు సైతం సజెస్ట్ చేస్తుంటారు. ఇక నల్ల మచ్చలనున్న అరటిని తీసుకోవడం ద్వారా ఎముకలు కూడా బలంగా మారుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..