Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending News: వీడేం మొగుడండి బాబు.. నడిరోడ్డుపై భార్యను మరచిపోయి వెళ్లిపోయాడు..ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే..

అర్థరాత్రి దాటి 3 గంటల సమయంలో బహిర్భూమి కోసం ఓ చోట కారు ఆపి ఇద్దరూ దిగారు..ఆ తర్వాత కారు వద్దకు వచ్చిన భర్త.. భార్య కూడా కారులో ఎక్కేసింది అనుకున్నాడు..వెంటనే కార్‌ స్టార్ట్‌ చేసుకుని వెళ్లిపోయాడు.

Trending News: వీడేం మొగుడండి బాబు.. నడిరోడ్డుపై భార్యను మరచిపోయి వెళ్లిపోయాడు..ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే..
Husband Forgot Wife
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 29, 2022 | 11:37 AM

మర్చిపోయే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు తమ వద్ద ఉన్న విలువైన వస్తువులను ఒకటో రెండో మర్చిపోతుంటారు. అయితే, ఎవరైనా తన భార్యను మర్చిపోవటం ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా..? అయితే, అలాంటి వింత సంఘటనే థాయ్‌లాండ్‌లో ఒకటి బయటపడింది . ఒక జంట కారులో ఎక్కడికో వెళ్తున్నారు. కానీ, మార్గమధ్యలో భార్యను మరచిపోయి 160 కిలోమీటర్లు ముందుకు వెళ్లాడు భర్త . భార్య ఆ వ్యక్తికి ఫోన్ చేయగా అతను కారులో కూడా లేడని ఆమె గ్రహించింది. ఈ వింత కేసు థాయ్‌లాండ్‌లోని మహాసరఖం ప్రావిన్స్‌కి చెందినది. పూర్తి వివరాల్లోకి వెళితే..

క్రిస్మస్ రోజున, 55 ఏళ్ల బూన్‌తోమ్ చైమూన్ తన భార్య ఎమునే చైమూన్‌తో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. అర్థరాత్రి దాటి 3 గంటల సమయంలో బహిర్భూమి కోసం ఓ చోట కారు ఆపి ఇద్దరూ దిగారు..ఆ తర్వాత కారు వద్దకు వచ్చిన భర్త.. భార్య కూడా కారులో ఎక్కేసింది అనుకున్నాడు..వెంటనే కార్‌ స్టార్ట్‌ చేసుకుని వెళ్లిపోయాడు. అలా ఏకంగా 100 మైళ్ళు ముందుకు వెళ్ళాడు.

ఇంతలో భయపడిపోయిన ఆ ఇల్లాలు బిక్కుబిక్కుమంటూ చీకట్లోనే 20 కిలోమీటర్లు నడిచింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఓ పోలీస్ స్టేషన్‌లో విషయమంతా చెప్పింది. దాంతో పోలీసులు బూన్‌తోమ్‌ను చాలాసార్లు ఫోన్‌లో సంప్రదించినప్పటికీ అతను ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. దీంతో పోలీసులు ఆ మహిళ బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఉదయం 8 గంటలైంది, కానీ భార్య లేకుండా కారు నడుపుతున్నట్లు అతడు మాత్రం గ్రహించలేదు. ఆ తర్వాత ఎలాగోలా పోలీసులు బూన్‌తోమ్‌ను సంప్రదించగలిగారు. అప్పటికి 160 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయాడు.

ఇవి కూడా చదవండి

విషయం తెలుసుకుని తేరుకున్న అతడు.. తిరిగి వెనక్కి వచ్చాడు. అంతదూరం ప్రయాణించేవరకు తన భార్యను ఎందుకు చూడలేదని పోలీసులు అడిగినప్పుడు, ఆమె వెనుక సీట్లో కూర్చుని నిద్రపోతుందని భావించినట్టుగా చెప్పాడు. అయితే, ఆ వ్యక్తి తన భార్య వద్దకు వెళ్లి తన నిర్లక్ష్యానికి క్షమాపణలు చెప్పాడు. భార్య కూడా చాలా ఉదారంగా క్షమించేసింది. దీని కోసం ఆమె తన భర్తతో గొడవ పడలేదు. వారిద్దరికీ పెళ్లై 27 ఏళ్లు పూర్తైనట్టుగా చెప్పింది. వారికి 26 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి