Noida: 23ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్‌.. మూడు గంటల పాటు ముగ్గురు డ్రైవర్ల ఘాతుకం

బాధితులరాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. టాక్సీ డ్రైవర్‌ను గుర్తించారు.

Noida: 23ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్‌.. మూడు గంటల పాటు ముగ్గురు డ్రైవర్ల ఘాతుకం
harassment
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 29, 2022 | 10:46 AM

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో మరో దారుణం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున యమునా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో 23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. టాక్సీ డ్రైవర్‌తో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత జైవీర్, టిటు, చాచా అనే నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఎత్మాద్‌పూర్ ఎసిపి రవి కుమార్ గుప్తా వివరాలు వెల్లడించారు. యువతి నోయిడా నుండి ఫిరోజాబాద్ మీదుగా టాక్సీలో ఔరయాలోని తన స్వస్థలానికి తిరిగి వస్తుండగా, ఆమె లైంగిక వేధింపులకు గురైంది. బాధితురాలు నోయిడాలోని ఓ ప్రైవేట్ గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున కుబేర్‌పూర్ నిర్మానుష్య ప్రాంతంలో జరిగింది. నిందితుల్లో ఒకరు కారు డ్రైవర్. నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపిన తర్వాత డ్రైవర్ మరో ఇద్దరిని పిలిచి యువతిపై అత్యాచారం చేశాడు. మిగిలిన ఇద్దరు కూడా అదే ప్రాంతంలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.

కాన్పూర్‌లోని తన స్వస్థలం ఔరయ్యకు వెళ్లాల్సిన మహిళను ఫిరోజాబాద్‌లో డ్రాప్ చేసేందుకు టాక్సీ డ్రైవర్ ఆఫర్ ఇచ్చాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. అర్ధరాత్రి అయిందని, టాక్సీలో వచ్చిన తన స్నేహితులిద్దరిని డ్రైవర్ పిలిపించాడు. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని బుధవారం ఉదయం ఎత్మాద్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధిత యువతి పోలీసులకు చెప్పిందని ఆగ్రా పోలీస్ కమిషనర్ డాక్టర్ ప్రితీందర్ సింగ్ వెల్లడించారు.

రాత్రి 8.30 గంటలకు నోయిడాలోని సెక్టార్ 37 నుండి బయలుదేరి ఫిరోజాబాద్‌కు టాక్సీ తీసుకున్నట్లు యువతి చెప్పింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని, ఆపై ఎత్మాద్‌పూర్ దగ్గర వదిలివేసి ఫిరోజాబాద్‌కు ఆటోలో ఎక్కించారని ఆమె చెప్పింది. బాధితులరాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. టాక్సీ డ్రైవర్‌ను గుర్తించారు. అతని ఇద్దరు సహచరులను సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అరెస్టు చేసినట్లు కమిషనర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?