PM Kisan Maandhan Yojana: 60 ఏళ్లు పైబడినవారికి కేంద్ర ప్రభుత్వ పెన్షన్.. నెలకు రూ. 3వేలు.. ఇది రావాలంటే ఏం చేయాలో తెలుసా..

దేశంలోని అసంఘటిత కార్మికులకు మంచి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజనను అమలు చేస్తోంది. అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ఈ పింఛను పథకం ఎంతో మేలు చేస్తుంది.

PM Kisan Maandhan Yojana: 60 ఏళ్లు పైబడినవారికి కేంద్ర ప్రభుత్వ పెన్షన్.. నెలకు రూ. 3వేలు.. ఇది రావాలంటే ఏం చేయాలో తెలుసా..
Pm Kisan Update
Follow us

|

Updated on: Dec 29, 2022 | 9:48 AM

దేశంలోని బలహీన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. అదేవిధంగా, దేశంలోని అసంఘటిత కార్మికులకు మంచి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజనను అమలు చేస్తోంది. అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఈ పింఛను పథకం ఎంతో మేలు చేస్తుంది. ఇది వారి భవిష్యత్తును ఆర్థికంగా దృఢంగా, భద్రంగా మారుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఈ పథకం కింద, శ్రామికులు, కర్శకులు, వ్యవసాయ కూలీలకు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా కనీసం రూ. 3000 స్థిర ఆర్థిక సహాయం అందిస్తోంది. అంతే కాదు, పింఛను పొందే సమయంలో ఎవరైనా మరణిస్తే.. లబ్ధిదారుని భార్య లేదా భర్త పెన్షన్ కింద పొందే మొత్తంలో 50 శాతం కుటుంబ పెన్షన్‌గా పొందుతారు.

పథకం కోసం ప్రభుత్వం షరతులు ఏంటి..

కేంద్ర ప్రభుత్వ ఈ పథకం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రమే. పథకంలో చేరే వ్యక్తి వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.. వారి సంపాదన గరిష్టంగా రూ. 15,000 వరకు ఉండాలి. ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన కింద, ఈ పెన్షన్ ప్లాన్‌లో మీరు పెట్టిన రూపాయల మొత్తం.. ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని మీ ఖాతాకు జమ చేస్తుంది. పథకం కింద, ఏ వ్యక్తి అయినా 60 ఏళ్ల వయస్సు వరకు ప్రతి నెలా రూ.55 నుంచి రూ.200 వరకు విరాళంగా ఇవ్వవచ్చు. అయితే, ఈ పథకంలో చేరడానికి, దాని ప్రయోజనాన్ని పొందడానికి మీరు కూడా నమోదు చేసుకోవాలి.

పథకం కోసం ఇలా నమోదు చేసుకోండి

ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మంధన్ యోజనలో చేరడానికి, మీరు ఆధార్ కార్డ్ , బ్యాంక్ ఖాతా కలిగి ఉండటం తప్పనిసరి. పథకం కోసం నమోదు చేసుకోవడానికి, మీరు మీ సమీప CSC అధికారిక వెబ్ సైట్ కి కానీ సెంటర్‌కు కాని వెళ్లాలి. సీఎస్‌సీకి వెళ్లిన తర్వాత, మీరు పథకంలో రిజిస్ట్రేషన్ కోసం అడగాలి. ఆ తర్వాత మీరు మీ ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్‌ను చూపించవలసి ఉంటుంది. దీని తర్వాత మీ బయోమెట్రిక్స్ డేటా ద్వార రికార్డ్ చేయబడుతుంది. దీని తర్వాత మీరు పథకం కింద నమోదు చేయబడతారు. మీకు శ్రమ యోగి కార్డ్ ఇవ్వబడుతుంది. ఇందులో శ్రమ యోగి పెన్షన్ ఖాతా సంఖ్య (SPAN) ఉంటుంది. భవిష్యత్తులో మీ ఖాతాకు సంబంధించిన ఎలాంటి సమాచారానికైనా ఈ నంబర్ ఉపయోగపడుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం