Winter Health: రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే.. ఓ సారి ట్రై చేస్తే.. ఎన్నో బెనెఫిట్స్..
చలి పెరిగిపోతోంది. అడుగు తీసి బయట పెట్టాలంటేనే వణికిపోయే పరిస్థితులు వచ్చాయి. భారతదేశం అంతటా ఇదే పరిస్థితి ఉంది. దీనితో పాటు సీజనల్ గా వచ్చే వ్యాధులు అదనం. కాబట్టి వాటి బారిన పడకుండా ఉండేందుకు...
చలి పెరిగిపోతోంది. అడుగు తీసి బయట పెట్టాలంటేనే వణికిపోయే పరిస్థితులు వచ్చాయి. భారతదేశం అంతటా ఇదే పరిస్థితి ఉంది. దీనితో పాటు సీజనల్ గా వచ్చే వ్యాధులు అదనం. కాబట్టి వాటి బారిన పడకుండా ఉండేందుకు డైట్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో తేనెను కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలం వచ్చే కొద్దీ మన ఆహార ప్రాధాన్యతలు కూడా మారిపోతుంటాయి. జ్యూస్‌లు, షేక్‌లకు బదులుగా.. వెచ్చని సూప్‌లు, గ్రీన్ వెజిటేబుల్స్, హెర్బల్ టీలను ఇష్టపడతుంటాం. శీతాకాలపు ఆహారాలు రుచికరమైనవి మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైనవి. కాబట్టి, రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు కొన్ని ఆహార పదార్థాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, వాల్‌నట్ వంటి డ్రై ఫ్రూట్స్ నాడీ వ్యవస్థ చురుగ్గా ఉండేలా చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. గింజలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. బాదంపప్పులో విటమిన్ ఇ, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వాల్‌నట్‌లు ఒమేగా-3 కి గొప్ప మూలం. వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
మసాలా బెల్లం: బెల్లం లేదా గుర్, శీతాకాలపు ప్రధానమైన ఆహారం మనకు తగినంతగా లభించదు. బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు, సెలీనియం, జింక్ వంటి మినరల్స్ అధికంగా ఉన్నాయి. కాబట్టి ఇది సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మసాలా గుర్ ఒక ప్రత్యేకమైన తయారీ. మీరు మీ రోజువారీ భోజనాన్ని మసాలా చేయడానికి ఉపయోగించవచ్చు.
ఉసిరి: గూస్బెర్రీ లేదా ఉసిరికాయ విటమిన్ సి వంటి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో సహాయపడుతుంది. భోజనంతో పాటు ఊరగాయలు, మురబ్బా, క్యాండీలు, చట్నీల రూపంలో ఉసిరిని తీసుకోవచ్చు. రూట్ వెజిటబుల్స్: బంగాళాదుంపలు, దుంపలు, యమ్‌లు, క్యాబేజీ, బ్రోకలీ, టుర్నిప్‌లు, క్యారెట్‌ల వంటి రూట్ వెజిటేబుల్‌లను అధికంగా తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, బి, ఫైబర్స్, పొటాషియం, బీటా కెరోటిన్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు ఈ కూరగాయలను రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..