Benefits of Meditation: ధ్యానం చేసే ముందు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోండి.. అప్పుడే మీకు ఆరోగ్య ప్రయోజనాలు..

Benefits of Meditation: ధ్యానం అనేది మీ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ఒక మార్గం. ధ్యానం ద్వారా చాలా పెద్ద వ్యాధులను అధిగమించవచ్చు.

Benefits of Meditation: ధ్యానం చేసే ముందు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోండి.. అప్పుడే మీకు ఆరోగ్య ప్రయోజనాలు..
Meditation
Follow us

|

Updated on: Aug 12, 2022 | 7:49 PM

ఏదైనా సరైన మార్గంలో చేయడం ద్వారా.. దాని ప్రయోజనాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అందుకే ఇవాళ మనం ధ్యానం గురించి చాలా ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ధ్యానం చేయడానికి సరైన మార్గం, ధ్యానంతో  ప్రయోజనాల ద్వారా మీరు ఒత్తిడిని తగ్గించడానికి, ఆందోళనను తగ్గించడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, రక్త స్థాయిని మెరుగు పరుచుకోవడానికి సహాయపడుతుంది. అనేక వ్యసనాల నుంచి కోలుకోవడానికి.. మంచి నిద్ర కోసం ధ్యానం చేయాలి. మీ మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ధ్యానం ఒక మార్గం అని చెప్పడం తప్పు కాదు. ఇదొక్కటే కాదు, ధ్యానం ద్వారా అధిగమించగలిగే అనేక ప్రధాన వ్యాధులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఈ వ్యాధులను..

ధ్యానం ద్వారా మీరు మీలో దాగి ఉన్న జ్ఞానాన్ని పొందగలరు. అలాగే, మీరు నియంత్రించగల అనేక తీవ్రమైన వ్యాధులు ఉన్నాయి. ధ్యానం సహాయంతో మీరు ఆందోళన, ఆస్తమా, క్యాన్సర్, నొప్పి, నిరాశ, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, నిద్ర సమస్యలు, తలనొప్పి వంటి వ్యాధులను అధిగమించవచ్చు. 

ప్రశాంతమైన..

ధ్యానం సహాయంతో మీరు మీ నడుస్తున్న మనస్సును నియంత్రించవచ్చు. అలాగే మిమ్మల్ని మీరు స్థిరపరచుకోవచ్చు. మనం ఒత్తిడికి లోనైనప్పుడు.. శరీరం సైటోకిన్స్ అని పిలువబడే అనేక తాపజనక రసాయనాలను విడుదల చేస్తుంది. ఇది మనల్ని డిప్రెషన్‌కు దారి తీస్తుంది. ఒత్తిడి కారణంగా శరీరం ఫైట్, ఫ్లైట్ మోడ్‌లో ఉంటుంది. మన గుండె కొట్టుకోవడం వేగవంతం కావడానికి ఇదే కారణం.

దాని వల్ల చాలా సమస్యలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో దీనిని అధిగమించడానికి ఉత్తమ మార్గం ధ్యానం చేయడం. ఈ విధంగా , ప్రారంభంలో మీరు శ్వాస వ్యాయామాలతో ధ్యానం చేయవచ్చు. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు, వదులుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి. మీ శ్వాసపై చాలా శ్రద్ధ వహించండి. దాని స్వరంపై దృష్టి పెట్టండి. అలాగే ఈ సమయంలో కళ్లు మూసుకుని ఉండండి. మీ శరీరంలోని ప్రతి భాగంపై దృష్టి కేంద్రీకరించండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. యోగ నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే యోగా నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం