Health Problems: మీకు తెలియకుండానే మళ్లీ మళ్లీ ఈ పొరపాట్లు చేస్తున్నారా..? ఇబ్బందుల్లో పడినట్లే..!
Health Problems: మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని తర్వాత వాకింగ్ చేయడం మంచి అలవాటు. మీరు నడవకపోయినా, ఆహారం తిన్న తర్వాత నిద్రపోకండి. రోజులో..
Health Problems: మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని తర్వాత వాకింగ్ చేయడం మంచి అలవాటు. మీరు నడవకపోయినా, ఆహారం తిన్న తర్వాత నిద్రపోకండి. రోజులో సమయం దొరికినప్పుడల్లా వ్యాయామం చేయండి. అదేమిటంటే బిజీలో ఆరోగ్యంగా ఉండేందుకు, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. కడుపు సరిగ్గా ఉండాలంటే పౌష్టికాహారం తింటే సరిపోదు. అలా కాకుండా ఆహారానికి సంబంధించిన కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు వీటిని ఆహారానికి సంబంధించిన ఆయుర్వేద నియమాలుగా పాటించాలి. అజీర్తిని పెంచే నాలుగు సాధారణ తప్పులు ఇవే..
☛ ఆహారంతో నీరు తాగడం
☛ భోజనం చేసిన వెంటనే నీరు తాగడం
☛ భోజనం తర్వాత టీ తాగడం
☛ భోజనం చేసిన వెంటనే స్వీట్లు తినడం
- ఆహారంతో పాటు నీరు తాగడం: కొంతమంది ఆహారంతో పాటు మధ్యమధ్యలో ఈ నీటిని సేవిస్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు వైద్య నిపుణులు. మీరు భోజనాల మధ్య నీరు తాగడం వల్ల ఆహారం జీర్ణం కావడం నెమ్మదిగా జరుగుతుంది. దీని కారణంగా కడుపులో బరువు, అజీర్ణం సమస్య ఉంటుంది.
- భోజనం చేసిన వెంటనే నీరు తాగడం: ఆహారంతో పాటు నీరు తాగడం ఒక చెడ్డ అలవాటు. భోజనం చేసిన వెంటనే ఎక్కువ నీరు తాగడం మంచిది కాదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. అప్పుడు పుల్లని త్రేనుపు, కడుపులో భారం, గ్యాస్, విశ్రాంతి లేకపోవడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి.
- భోజనం చేసిన తర్వాత టీ తాగడం: చాలా మందికి భోజనం చేసిన తర్వాత టీ తాగడం అలవాటు ఉంటుంది. ఇదో ట్రెండ్‌గా మారిపోయింది. ఇది మంచి అలవాటు కాదంటున్నారు నిపుణులు. దీని వల్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్ ప్రపంచంలో పనిచేస్తున్న యువతలో ఇలాంటి అలవాటు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. దీని వల్ల మీ శరీరానికి తగినంత ఐరన్, విటమిన్స్ లభించవు.
- భోజనం చేసిన వెంటనే స్వీట్లు తినడం: చాలా మందికి భోజనం చేసిన తర్వాత స్వీట్లు తినడం అలవాటు ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ పూర్తిగా దెబ్బతింటుంది. భోజనం చేసిన వెంటనే తీపి పదార్థాలు తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)
ఇదికూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు