AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: ఈ ఆకుపచ్చ మొక్కలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం.. చక్కెర స్థాయిని నియంత్రించే గుణం

Diabetes: డయాబెటిస్ రోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మందులు వాడుతుంటారు. అలాగే ఇన్సులిన్ ఇంజెక్షన్లు కూడా తీసుకుంటారు. అయితే రక్తంలో చక్కెర స్థాయిని సహజ..

Diabetes: ఈ ఆకుపచ్చ మొక్కలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం.. చక్కెర స్థాయిని నియంత్రించే గుణం
Diabetes
Subhash Goud
|

Updated on: Aug 11, 2022 | 9:28 PM

Share

Diabetes: డయాబెటిస్ రోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మందులు వాడుతుంటారు. అలాగే ఇన్సులిన్ ఇంజెక్షన్లు కూడా తీసుకుంటారు. అయితే రక్తంలో చక్కెర స్థాయిని సహజ పద్ధతుల ద్వారా కూడా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మధుమేహం వ్యాధి జన్యుపరంగా కూడా వస్తుంటుంది. అయితే ఇది సాధారణంగా చెడు ఆహారం, సరైన జీవనశైలి లేని కారణంగా వస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో ఎరికైనా షుగర్‌ ఉంటే, లేదా ఒత్తిడి, ఇతర కారణాల వల్ల కూడా వస్తుంటుంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఎంతో మందిని వెంటాడుతోంది ఈ మధుమేహం. ఈ పచ్చటి మొక్కల సాయంతో షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు, ఆహార నియంత్రణతో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు గానీ, మధుమేహానికి ఇంతవరకు మధుమేహం పూర్తిగా నయం అయ్యే విధంగా మందు కనిపెట్టలేకపోయారు శాస్త్రవేత్తలు. భారతదేశంలోని ప్రసిద్ధ ఆరోగ్య నిపుణుడు నిఖిల్ వాట్స్ మాట్లాడుతూ.. గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచుకునే సహాయంతో కొన్ని ఆకుపచ్చ మొక్కలు ఉపయోగపడతాయన్నారు.

కరివేపాకు:

కరివేపాకులను సాధారణంగా దక్షిణ భారతదేశంలోని వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లలో కలిగి ఉంటుంది. మధుమేహ రోగులు కరివేపాకు టీ తయారు చేసి తాగవచ్చు. దీని వల్ల వారికి ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వేప ఆకులు:

వేప ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీని ఆకులు, పండ్లు, పువ్వులు, బెరడు, కలపను ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఉదయాన్నే నిద్రలేచి దీని పచ్చి ఆకులను నమిలి తింటే గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మధుమేహం వ్యాధిగ్రస్తులకు వేప దివ్య ఔషధంగా పని చేస్తుంది. షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచేందుకు వేప ఆకులు అద్భుతంగా ఉపయోగడపతాయి.

తిప్పతీగ:

తిప్పతీగను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తుంటారు. ఇది చక్కెర స్థాయిని అదుపులో ఉంచేందుకు అద్భుతంగా పని చేస్తుంది. తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు. ఈ తిప్ప తీగను ఉపయోగించి జ్యూస్‌, పౌడర్‌, కాప్సూల్‌ తయారు చేస్తారు. ఇది రక్తాన్ని శుభం చేయడంలో ఉపయోగపడుతుంది. తిప్పతీగను పొడి చేసి బెల్లంలో కలుపుకొని తింటే అజీర్తి సమస్యను దూరం చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
మార్కెట్లోకి ఈ3 ట్రయాన్ కొత్త ఈవీ స్కూటర్
మార్కెట్లోకి ఈ3 ట్రయాన్ కొత్త ఈవీ స్కూటర్
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..