Rain: వర్షపు నీటిని తాగడం సురక్షితం కాదు.. తాజా అధ్యయనంలో సరికొత్త విషయాలు..ఎందుకో తెలుసా..
Rain Water:ఈ వాటర్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇదంతా గతం అంటున్నారు పరిశోధకులు. స్టాక్‌హోమ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం..
వర్షపు నీరు చాలా శుద్ధమైనది. భూమి మీద నీరే ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడి.. వర్షంగా కురుస్తుంది. వర్షపు నీరు నాన్ ఆల్కలీన్ గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇదంతా గతం అంటున్నారు పరిశోధకులు. స్టాక్‌హోమ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, మార్గదర్శకాలను అధిగమించే PFAS (పర్- పాలీఫ్లోరోఅల్కిల్) అని కూడా పిలువబడే విషపూరిత సమ్మేళనాల స్థాయిల కారణంగా వర్షపు నీరు త్రాగడం చాలా హానికరం అని తేలింది. రసాయనాలు ఎప్పటికీ రసాయనాలే అని వెల్లడించింది. ఎందుకంటే అవి చాలా నెమ్మదిగా విచ్ఛిన్నమవుతాయి. ఈ అధ్యయనం ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురించబడింది.
PFAS మొదట షాంపూలు, సౌందర్య సాధనాలలో కనుగొనబడింది. కానీ ఇప్పుడు గాలి, నీటితో సహా మొత్తం పర్యావరణానికి వ్యాపించింది. ఇయాన్ కజిన్స్ మాట్లాడుతూ, “తాము తీసుకున్న కొలతల ప్రకారం, వర్షం త్రాగడానికి సురక్షితంగా భూమిపై ఎక్కడా లేదు.” అని వెల్లడించారు.
“అంటార్కిటికా లేదా టిబెటన్ పీఠభూమిలో కూడా, వర్షపు నీటి స్థాయిలు US EPA (పర్యావరణ పరిరక్షణ సంస్థ) ప్రతిపాదించిన తాగునీటి మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉన్నాయి” అని వారి బృందం 2010 నుంచి డేటాను సంకలనం చేసింది.
PFASకి గురికావడం వల్ల సంతానోత్పత్తి, శిశు అభివృద్ధి మందగించడం, ఊబకాయం ప్రమాదాన్ని పెంచడం, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మరిన్ని సైంటిఫిక్ వార్తల కోసం