AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO SPARK: తొలి 3డి వర్చువల్ స్పేస్ మ్యూజియం ప్రారంభించిన ఇస్రో.. చూస్తే వావ్ అనాల్సిందే..

ఇందులో ఇస్రో, ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాల విజయాలను వివరించారు. ఇస్రోను నిర్మించి, ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తల కథనాలు ఉన్నాయి.

ISRO SPARK: తొలి 3డి వర్చువల్ స్పేస్ మ్యూజియం ప్రారంభించిన ఇస్రో.. చూస్తే వావ్ అనాల్సిందే..
Isro Spark Virtual Space Museum
Venkata Chari
|

Updated on: Aug 12, 2022 | 6:35 AM

Share

ఇస్రో తన వర్చువల్ స్పేస్ మ్యూజియం స్పార్క్ (SPARK) ను ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పురస్కరించుకుని ప్రారంభించింది. ఇది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ చరిత్ర, విజయాలను వర్ణించే డిజిటల్ కంటెంట్‌కు సంబంధించిన మ్యూజియం. దీన్ని చూస్తుంటే, ఇది నిజమైన స్థలం గురించి సమాచారాన్ని అందించే ప్రారంభ వీడియోలా ఉంది. ఇస్రో https://spacepark.isro.gov.in పేరుతో ఒక సైట్‌ను ప్రారంభించింది. దానిపై మీరు అనేక రకాల పత్రాలు, ఫోటోలు, వీడియోలను చూడొచ్చు. ఇవన్నీ ఇస్రో చరిత్రకు, ప్రయోగానికి సంబంధించినవి. మిషన్ కథనాలు, రాకెట్లు, ఉపగ్రహాలు, ఇతర శాస్త్రీయ మిషన్ల గురించిన సమాచారం అందుబాటులో ఉన్నాయి. ఈ వెబ్‌సైట్ బీటా వెర్షన్ ఇస్రో సైట్‌లో అందుబాటులో ఉంది.

SPARK అనేది ISRO మొదటి 3D వర్చువల్ స్పేస్ టెక్ పార్క్. ఈ పార్కులో ఒక మ్యూజియం ఉంది. థియేటర్లు ఉన్నాయి. ఒక అబ్జర్వేటరీ, తోటలు కూడా ఉన్నాయి. పిల్లల ఆటల పార్కుతో పాటు, వాస్తవ పరిమాణంలోని రాకెట్లు కూడా చూపించారు. సరస్సు ఒడ్డున ఒక హోటల్ కూడా ఉంది. ఈ పార్క్ సముద్రపు ఒడ్డున నిర్మించినట్లు చూపించారు. స్పార్క్ మ్యూజియం ఈ పార్క్ ప్రధాన లక్షణం. ఇందులో ఇస్రో, ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాల విజయాలను వివరించారు. ఇస్రోను నిర్మించి, ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తల కథనాలు ఉన్నాయి.

మీరు SPARK సైట్‌లోకి వెళ్లి అన్ని వైపుల నుంచి మ్యూజియాన్ని చూడొచ్చు. వీడియో ప్లే చేయవచ్చు. మీరు ఎడమ, కుడి బాణాల నుంచి పార్క్ 360 డిగ్రీల యాంగిల్‌తో చూడొచ్చు. ప్రకృతితో పాటు సైన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని చూపించారు.

ఇవి కూడా చదవండి

అందులో స్పేస్ ఆన్ వీల్స్ పేరుతో ఒక బస్సు ఉంది. పిల్లలు దాని వద్దకు వెళ్లి అంతరిక్షానికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటుంటారు. దానికి సమీపంలోనే అబ్జర్వేటరీ చూపించారు. అబ్జర్వేటరీ లోపల పెద్ద టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు. విశ్వం రహస్యాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఇక్కడ సోలార్ సిస్టమ్ పార్క్ కూడా ఉంది. ఇందులో సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ చూపించారు. వాటి వివరాలు ఒక్కో గ్రహం కింద అందించారు. పార్క్ మొత్తం చాలా అందంగా ఉంది. తోటలు ఉన్నాయి. ఫౌంటెయిన్లు ఉన్నాయి. ఒకవైపు సరస్సు, మరోవైపు సముద్రం కూడా ఉంది. సెల్ఫీ పాయింట్‌ను ‘ఐ లవ్‌ను ఇస్రో’ గా తీర్చిదిద్దారు. దీని వెనుక మ్యూజియం, మూడు రాకెట్లు కనిపిస్తాయి.