- Telugu News Photo Gallery Technology photos Motorola launches new smart phone Moto g62 5g features and price details Telugu Tech News
Moto g62 5g: మోటోరోలా నుంచి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్.. రూ. 20 వేల లోపు ఆకట్టుకునే ఫీచర్లు..
Moto g62 5g: దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తోన్న తరుణంలో మోటోరోలో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో జీ62 పేరుతో లాంచ్ చేసినీ స్మార్ట్ ఫోన్ తొలి సేల్ ఆగస్ట్ 19 మధ్యాహ్నం ప్రారంభంకానుంది..
Updated on: Aug 11, 2022 | 7:57 PM

మోటోరోలో భారత మార్కెట్లోకి 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో జీ62 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ఆగస్టు 19న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందిస్తున్నారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. డ్యూయెల్ స్పీకర్స్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌ను మిడ్‌నైట్ గ్రే, ఫ్రాస్టెడ్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

ధర విషయానికొస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999కి అందుబాటులో ఉండనుంది.




