Diabetes: మీకు బ్లడ్ షుగర్ పెరిగిపోతోందా..? వాల్‌నట్స్‌తో అద్భుతమైన ప్రయోజనం..!
Diabetes: ప్రస్తుతం ఇంటింటికి డయాబెటిస్ పేషెంట్లు పెరిగిపోతున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలా మందిని వెంటాడుతోంది మధుమేహం. జీవనశైలి, కుటుంబ చరిత్ర..
Diabetes: ప్రస్తుతం ఇంటింటికి డయాబెటిస్ పేషెంట్లు పెరిగిపోతున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలా మందిని వెంటాడుతోంది మధుమేహం. జీవనశైలి, కుటుంబ చరిత్ర, ఒత్తిడి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇక డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవాలంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎల్లప్పుడు అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల మందులు వేసుకోకుండానే డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
డయాబెటిక్ రోగి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజూ ఒక పిడికెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అనేక వ్యాధులు దూరం అవుతాయి. మీరు అన్ని డ్రై ఫ్రూట్స్ తినలేకపోతే, మధుమేహంలో మీరు ప్రతిరోజూ 2 వాల్‌నట్స్ తినాలి. రోజూ వాల్‌నట్‌లను తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.
వాల్‌నట్స్‌లో లభించే పోషకాలు:
ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, కాపర్, సెలీనియం వంటి ఖనిజాలకు వాల్‌నట్‌లు మంచి మూలం. ఇది కాకుండా వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్‌లో వాల్‌నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
- డయాబెటిస్ నియంత్రణ: అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం కారణంగా మధుమేహం వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధిగా మారింది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఫైబర్, విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీని కోసం మీరు ప్రతిరోజూ 2 నానబెట్టిన వాల్‌నట్‌లను తీసుకోవాలి. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
- బ్లడ్ షుగర్ కంట్రోల్: మనం ఏ ఆహారం తీసుకున్నా అది మన శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్ పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ రోగి రక్తంలో చక్కెరను నియంత్రించే ఆహారాన్ని తీసుకోవాలి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే గుణాలు వాల్‌నట్‌లో ఉన్నాయి.
- ఊబకాయాన్ని తగ్గించండి: వాల్ నట్స్ తినడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. ఇది ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుకు మంచి మూలం. ఈ పోషకాలతో స్థూలకాయాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు స్థూలకాయాన్ని నియంత్రించుకోవాలని సూచించారు. అటువంటి పరిస్థితిలో వాల్‌నట్‌లు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)
ఇదికూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు