- Telugu News Photo Gallery Home remedies for hair loss: can stop your Hair fall in just one week to use this remedi
Beauty tips: వారానికి 2 సార్లు ఈ హెయిర్ మాస్క్ వాడారంటే.. కేవలం రెండు వారాల్లో పట్టుకుచ్చులాంటి కురులు మీసొంతం..
అపురూపంగా చూసుకునే కురులు కళ్లముందే రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. ప్రస్తుత జీవన శైలి కారణంగా అనేక మంది మహిళలు ఆందోళన చెందుతున్నారు. జుట్టు పొడిబారి గరుకుగా మారడం, చివర్లు చిట్లడం వంటి ఎన్నో ఇబ్బందులు నిత్యం వెంటాడుతున్నాయి..
Updated on: Aug 12, 2022 | 2:10 PM

అపురూపంగా చూసుకునే కురులు కళ్లముందే రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. ప్రస్తుత జీవన శైలి కారణంగా అనేక మంది మహిళలు ఆందోళన చెందుతున్నారు. జుట్టు పొడిబారి గరుకుగా మారడం, చివర్లు చిట్లడం వంటి ఎన్నో ఇబ్బందులు నిత్యం వెంటాడుతున్నాయి.

జీవనశైలి మార్పులతో పాటు, వాతావరణం జుట్టుపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి రక్షించడానికి వంటగదిలో దొరికే పదర్థాలతో జుట్టు రాలే సమస్యను సులువుగా అధిగమించవచ్చు.

వంటల్లో ఉపయోగించే నల్ల జీలకర్రలో తలపై వెంట్రులు దట్టంగా పెరిగేలా చేసే గుణం కలిగి ఉంటుందని మీకు తెలుసా?

వారానికి రెండుసార్లు నల్ల జీలకర్రతో తయారు చేసిన హెయిర్ మాస్క్‌ని ఉపయోగించారంటే పలుచబడిన జుట్టు దట్టంగా, పొడవుగా, నల్లగా, మందంగా పెరుగుతుంది.

నల్ల జీలకర్రతో కొన్ని మెంతి గింజలు వేసి రాత్రంతా నానబెట్టాలి.

తర్వాత ఉదయాన్నే మెంతి గింజలు, నల్ల జీలకర్రను పేస్ట్ చేసి తలకు, జుట్టుకు పట్టించాలి. 40 నిమిషాల తర్వాత సల్ఫేట్ లేని షాంపూ గోరువెచ్చని నీటితో తల స్నానం చేసుకోవాలి.





























