- Telugu News Photo Gallery Spiritual photos Former MLC Annam Satish Prabhakar donnets a Gold Crown Worth Rs 45 Lakh to Shirdi Saib aba
Shirdi Sai baba: షిర్డీ సాయి బాబాకు బంగారు కిరీటం.. తెలుగు భక్తుడి విశేషమైన కానుక..
సాక్షాత్తు దేవతాస్వరూపుడైన షిరిడీ సాయి బాబా భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచారు. ఆధ్మాత్మిక గురువుగా, సాధువుగా, ఫకీరుగా విభిన్న అవతారాలలో భక్తులకు ఆయన దర్శనమిచ్చారు.
Updated on: Aug 12, 2022 | 5:33 PM

షిరిడీ సాయిబాబా బోధనల్లో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ మొదలైనవి చాలా ముఖ్యమైనవి. అదె్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు అతని బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి.

ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తుంటారు.

సాయిబాబాకు తమకు తోచిన కానుకలను భక్తులు సమర్పిస్తుంటారు. ఎవరి స్థోమతను అనుసరించి వారు సాయిబాబాకు కానులకు సమర్పించుకుంటారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తుడు ఓ అపురూపమైన కానుకను సమర్పించుకున్నారు.

సాయి భక్తుడు అన్నం సతీష్ ప్రభాకర్ షిర్డిసాయిబాబాకు బంగారు కిరిటాన్ని సమర్పించుకున్నారు. సాయినాథుడికి కిరిటాన్ని అందించాలని తాను 20 ఏళ్లుగా కలలు కన్నానని చెప్పుకొచ్చారు.

తన కుటుంబంతో కలిసి బాబాను దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించి, కిరిటాన్ని సమర్పించినట్లుగా తెలిపారు.

ఈ బంగారు కిరిటం విలువ సుమారు రూ. 45 లక్షల విలువైన ఉంటుందని.. బరువు 770 గ్రాముల వరకు ఉండవచ్చన్నారు. అలాగే సాయినాథుడికి నైవేధ్యం సమర్పించేందుకు 620 గ్రాముల వెండి పళ్లెంను అందించారు.





























