Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moon Gazing Meditation: ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా.. ఏకాగ్రత తగ్గుతుందా.. చంద్ర ధ్యానం చేసి చూడండి..

రోజులో పని ముగించుకున్న తర్వాత మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం ఒక గొప్ప ఎంపిక. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చంద్రుడిని చూసే ధ్యానం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.

Moon Gazing Meditation: ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా.. ఏకాగ్రత తగ్గుతుందా.. చంద్ర ధ్యానం చేసి చూడండి..
Moon Gazing Meditation
Follow us
Surya Kala

|

Updated on: Sep 11, 2022 | 12:00 PM

Moon Gazing Meditation: ప్రస్తుతం మనిషి జీవన శైలిలో పని, ఒత్తిడి భాగంగా మారిపోయింది. ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి తరచుగా ప్రజలు సెలవులకు వెళతారు. చాలామంది జిమ్ లేదా స్పోర్ట్స్ వంటి శారీరక వ్యాయామాలపై దృష్టి పెడతారు. వీటన్నింటితో పాటు యోగా, వ్యాయామం కూడా చేస్తుంటారు. అయితే రోజులో పని ముగించుకున్న తర్వాత మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం ఒక గొప్ప ఎంపిక. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చంద్రుడిని చూసే ధ్యానం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు. ఇలా చేయడం వల్ల మనం ఒత్తిడి లేకుండా ఉంటాం. చంద్రుడిని చూసే ధ్యానం ఎలా ప్రయోజనకరమో తెలుసుకుందాం.

చంద్రుని వీక్షించడం అంటే ఏమిటి? నిజానికి చంద్రుని చూడటం అంటే ఏకాగ్రతతో ధ్యానం చేయడం. అంటే చంద్రునిపై దృష్టి కేంద్రీకరించడం. ఈ ప్రక్రియను మూన్ గేజింగ్ మెడిటేషన్ అంటారు. ఈ ధ్యానం కూడా పాత కాలంలో కొవ్వొత్తి ముందు కూర్చొని ధ్యానం చేసే పద్ధతిని పోలి ఉంటుంది. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని చంద్రుడిని చూస్తూ ఉండటాన్ని చంద్రుని దర్శనం లేదా చంద్ర స్నానం అంటారు. మన ఆయుర్వేదంలో కూడా చంద్ర స్నానం గురించి పేర్కొన్నారు.

చంద్రుని వీక్షించడం వల్ల కలిగే ప్రయోజనాలు: శరీరం, మనస్సు విశ్రాంతినివ్వడమే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చంద్రుని వీక్షించే అభ్యాసం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఆందోళన, ఒత్తిడి వంటి అన్ని సమస్యల నుండి బయటపడటానికి, రాత్రిపూట నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చుని ధ్యాన భంగిమలో చంద్రుడిని చూడటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే చంద్రుని చూసే ధ్యానం ప్రభావాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే దీనికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

చంద్ర స్నానం వల్ల కలిగే ప్రయోజనాలు:  చంద్రుని వీక్షించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనిషి ఒత్తిడిని తగ్గిస్తుంది. మూన్ గేజింగ్ ఏకాగ్రత శక్తిని మెరుగుపరుస్తుంది. దీంతో మనకు మంచి నిద్ర వస్తుంది. అంతేకాదు బలమైన భావన కూడా అభివృద్ధి చెందుతుంది. చంద్ర స్నానంతో భావోద్వేగం పెరుగుతోంది. అయితే చంద్ర స్నానం మీరు దీన్ని ఎప్పటి నుండి చేయడం ప్రారంభించారో ఇక్కడ గుర్తుంచుకోవడం ముఖ్యం. చంద్రుని తగ్గుదల, పెరుగుదల ప్రకారం మీ ఏకాగ్రతను పెంచడం లేదా తగ్గించడం కూడా అవసరం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఇవ్వబడింది. వీటిని TV9 తెలుగు ధృవీకరించలేదు. నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)