Meditation: రోజుకు పది నిమిషాల పాటు ధ్యానం.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?
Health Tips: బిజీ లైఫ్‌కు తోడు అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా శరీరం ఎన్నో ఆటుపోట్లకు గురవుతోంది. చిన్న వయసులోనే చాలామంది మధుమేహం, రక్తపోటు వంటి తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నారు.
Health Tips: బిజీ లైఫ్‌కు తోడు అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా శరీరం ఎన్నో ఆటుపోట్లకు గురవుతోంది. చిన్న వయసులోనే చాలామంది మధుమేహం, రక్తపోటు వంటి తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలకు ప్రధాన కారణాల్లో మానసిక ఒత్తిడి కూడా ఒకటి. మానసిక ఆందోళనలను తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలను ఎంచుకుంటారు. కొంతమంది మానసిక ఆరోగ్య నిపుణుల దగ్గర చికిత్స తీసుకుంటే, మరికొందరు యోగా ద్వారా తమను తాము ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే మరొక అంశం ధ్యానం. దీనికి చాలా పాత చరిత్ర ఉంది. మనదేశంతో పాటు పొరుగు దేశాల్లోని ప్రజలు పురాతన కాలం నుండి ధ్యానం చేస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు కనీసం పది నిమిషాల పాటు ధ్యానం చేస్తే డయాబెటిస్, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయట.
మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధం..
మానసిక ఆరోగ్యం మెరుగుపడడానికి ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. ఇక డిప్రెషన్‌తో బాధపడేవారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. అయితే ధ్యానం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ప్రజలు మెడిటేషన్ చేయడానికి ఎందుకో బద్దకిస్తారు. కారణమడిగితే బిజీ లైఫ్ స్టైల్, సమయాభావమంటూ ఏవేవో సాకులు చెబుతారు. అయితే ఎంత బిజీగా ఉన్నా కొన్ని సాధారణ విషయాలను దృష్టిలో ఉంచుకుని ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తే, అది ఖచ్చితంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
యోగాలాగే ధ్యానానికి కూడా ఒక నిర్దిష్టమైన స్థలం అవసరమని చాలామంది అనుకుంటారు. అయితే అలాంటిదేమీ లేదు. మీరు ఎక్కడైనా ఈ ఆరోగ్య చిట్కాను అనుసరించవచ్చు. టెర్రస్‌పైకి వెళ్లి ఆకాశం వైపు చూస్తూ ధ్యానం చేయవచ్చు. ధ్యానమంటే మన గురించి మనం ఆలోచించకోవడం. ధ్యానం చేసేటప్పుడు ఇల్లు, కుటుంబ ఒత్తిడులను పక్కన పెట్టి మన గురించి మాత్రమే ఆలోచించాలి. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. తద్వారా పనులపై ఏకాగత్ర, దృష్టి పెరుగుతుంది. విజయాలు సాధిస్తారు.
కంఫర్ట్ జోన్‌లోనే..
ధ్యానం ఇలాగే చేయాలన్న ప్రత్యేక నిబంధనలేమీ లేదు. మనకున్న కంఫర్ట్ జోన్ పరిధిలోనే మెడిటేషన్ చేయవచ్చు. మన మనసుకు ప్రశాంతత కలిగించే అంశాలను కనుగొనండి. మీకు ఏది సుఖంగా అనిపిస్తుందో అదే చేయండి. అదే రోజూ ఫాలో అవ్వండి. మానసిక ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందండి. చేపట్టిన రంగాల్లో విజయాలు సాధించండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..