Dandruff Tips: చలికాలం చుండ్రు సమస్య వేధిస్తోందా.? ఈ చిట్కాలు పాటిస్తే వెంటనే ఫలితం..

నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, తీసుకునే ఆహారంలో మార్పు కారణం ఏదైనా.. ఇటీవల జుట్ట సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా చుండ్రు సమస్యతో ఎక్కువవుతోంది. ఇక చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువవుతోంది. పొడిబారిన చర్మం కారణంగా చాలా మంది చుండ్రు సమస్యతో..

Dandruff Tips: చలికాలం చుండ్రు సమస్య వేధిస్తోందా.? ఈ చిట్కాలు పాటిస్తే వెంటనే ఫలితం..
Dandruff Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 30, 2022 | 1:50 PM

నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, తీసుకునే ఆహారంలో మార్పు కారణం ఏదైనా.. ఇటీవల జుట్ట సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా చుండ్రు సమస్యతో ఎక్కువవుతోంది. ఇక చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువవుతోంది. పొడిబారిన చర్మం కారణంగా చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడుతున్నారు. చుండ్రు సమస్యకు సకాలంలో నివారణ చర్యలు ప్రారంభించకపోతే జట్టు రాలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ చుండ్రు సమస్యకు న్యాచురల్‌గా ఎలా చెక్‌ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* పొడి చర్మానికి సంబంధిత చుండ్రు చలికాలం మరింత ఎక్కుతుంది. కాబట్టి ఈ సమయాల్లో వేడి నీటితో తల స్నానం చేయడం ఆపేయాలి. దీని వల్ల తల పొడిగా, పొరలుగా మారుతుంది. దీంతో చుండ్రు పెరుగుతుంది.

* క్రమం తప్పకుండా ఆయిల్‌తో మసాజ్‌లు చేసుకోవడం వల్ల చుండ్రు సమస్య నుంచి బయటపడొచ్చు. రెగ్యులర్‌గా హెడ్‌ మసాజ్‌ చేసుకోవడం వల్ల తలపై రక్తప్రసరణ మెరుగై చుండ్రు తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి

* కొన్ని సందర్భాల్లో ఒత్తిడి, ఆందోళన కూడా చుండ్రుకు కారణంగా మారుతుండొచ్చు. తలపై సెబన్‌ అనే నూనె పేరుకుపోయినప్పుడు కూడా చుండ్రు పెరుగుతుంది. దీనికి కారణం ఒత్తిడి. కాబట్టి మెడటేషన్‌ వంటివి అలవాటు చేసుకుంటే మంచిది.

* ఇక హార్డ్‌ వాటర్‌తో తల స్నానం చేయడం వల్ల కూడా చుండ్రు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి నీటివల్ల జుట్ట పొడిగా, నిర్జీవంగా తయారవుతుంది. ఫలితంగా చుండ్రు పెరుగుతుంది.

* చుండ్రును న్యాచురల్‌గా చెక్‌ పెట్టడంలో గుడ్డు మంచి ఔషదంలా పనిచేస్తుంది. గుడ్లలో ఉండే జింక్‌ జుట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో చుండ్రు తగ్గుతుంది.

* ఆలివ్ నూనె, వేరుశెనగ వెన్న, అవిసె గింజలు వంటి వాటిని డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా చుండ్రు సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించినది మాత్రమే. ఆరోగ్యం విషయంలో నిపుణుల సూచనలు పాటించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..