Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saffron Water: కుంకుమలా నువ్వే.. అంటూ పాడుకోవడం కాదు! దాని ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకోండి..

సాధారణంగా కుంకుమపువ్వులో ఆరోగ్యానికి మేలు చేసే మినరల్స్ ఉంటాయి. ఇది మహిళల్లో సంతానోత్పత్తికి దోహదం చేస్తాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఈ కుంకుమ నీరు తీసుకోవడం ద్వారా అధిక ప్రయోజనాలు ఉంటాయి.

Saffron Water: కుంకుమలా నువ్వే.. అంటూ పాడుకోవడం కాదు! దాని ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకోండి..
Saffron
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Dec 30, 2022 | 12:11 PM

చాలా మందికి ఉదయాన్నే లేవగానే కాఫీ, టీ తాగడం అలవాటుగా ఉంటుంది. అది లేకపోతే వారికి రోజు ప్రారంభమవదు. పొరపాటున అది తాగకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో దీనికి ప్రత్యామ్నాయంగా కొందరు గ్రీన్ టీ, లేదా లెమన్ టీ తీసుకొంటున్నారు. అయితే వీటన్నటి స్థానంలో ప్రత్యేకంగా కుంకుమపువ్వుతో తయారు చేసిన టీ ని చాలా మంది ఇటీవల తీసుకుంటున్నారు. కుంకుమ టీ ఏంటీ అనుకుంటున్నారా? టీ అంటే టీ కాదు లెండి.. కుంకుమ పువ్వుతో పాటు కొన్ని రకాల ఇన్ గ్రేడియంట్స్ కలపి వాటర్ ని తాగుతున్నారు. దీని వల్ల తమకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా చాలా మంది పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా Posh. Ayurveda అనే పేజీలో కుంకుమ పువ్వు నీరు తాగి ఆరోగ్యాన్ని సంతరించుకున్న వారి తమ అనుభవాలను పంచుకుంటున్నారు. వీరిలో మహిళలే అధికంగా ఉండటం గమనించాల్సిన అంశం.

కుంకుమ.. సుగుణాల కలయిక..

సాధారణంగా కుంకుమపువ్వులో ఆరోగ్యానికి మేలు చేసే మినరల్స్ ఉంటాయి. ఇది మహిళల్లో సంతానోత్పత్తికి దోహదం చేస్తాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఈ కుంకుమ వాటర్ తీసుకోవడం ద్వారా అధిక ప్రయోజనాలు ఉంటాయి. చర్మం ఆరోగ్యం గా ఉండటంతో పాటు ఇదివరకు లేనంతగా కాంతివంతంగా తయారైందని Posh. Ayurveda గ్రూప్లో కొందరు పోస్ట్ చేశారు. అలాగే కాఫీ ఎడిక్ట్ అయిన వారు కూడా దాని నుంచి బయట పడేందుకు దీనిని అలవాటు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జట్టు ఆరోగ్యానికి ఈ కుంకుమ వాటర్ ఉపయోగపడుతున్నట్లు వివరిస్తున్నారు. అలాగే పీరియడ్స్ సమయంలో కలిగే అధిక నొప్పి, తీవ్రమైన బాధ నుంచి ఇది ఉపశమనం కలుగజేస్తున్నట్లు పేర్కొన్నారు.

తయారీ కి కావాల్సిన పదార్థాలు..

  • 1 గ్లాసు (250ml) నీరు
  • 5-6 తంతువులు – కుంకుమపువ్వు
  • 1 అంగుళం – దాల్చిన చెక్క
  • 2 – ఏలకులు
  • 4-5 – బాదం పప్పులు
  • తేనె, మీ అభిరుచి ప్రకారం

తయారీ ఇలా..

* దాల్చిన చెక్క, కుంకుమపువ్వు, ఏలకులను నీటిలో వేసి ఐదు నిమిషాలు తక్కువ మంటపై మరిగించాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం ఆ మిశ్రమాన్ని కాస్త వడగట్టి చల్లార్చండి.

*ఆ తర్వాత తేనె, బాదంపప్పు వేసి కలిపి తాగాలి.

ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా..

సాధారణంగా కుంకుమలో చాలా ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. ఇది వ్యాధి నిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది. చర్మ సౌందర్యానికి ఎంతో కాలంగా మహిళలు వాడుతున్నారు. అలాగే కుంకుమపువ్వులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, ఇమ్యూనిటీ బూస్టింగ్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మహిళల్లో పీరియడ్స్ ను క్రమబద్దీకరించడంలో సాయపడుతంది. యాంగ్జయిటీని కూడా అదుపు చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..