New Year Gifts: కొత్తేడాదికి మీ పాట్నర్‌ను ఈ గిఫ్ట్స్‌తో సర్‌ప్రైజ్‌ చేయండి.. పక్కా థ్రిల్ అవుతారు.

కాల గర్భంలో మరో ఏడాది గడిసిపోతోంది. కొత్తేడాదికి వెల్‌కమ్‌ చెప్పడానికి అందరూ సిద్ధమవుతున్నారు. సెలబ్రేషన్స్‌ చేసుకోవడానికి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ప్లాన్‌లు చేసుకుంటున్నారు. టూర్‌, పార్టీలు, ఈవెంట్స్‌తో డిసెంబర్‌ 31ని ఎంజాయ్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యారు. అయితే ఇదే సమయంలో న్యూఇయర్‌కి నచ్చిన వ్యక్తులకు...

New Year Gifts: కొత్తేడాదికి మీ పాట్నర్‌ను ఈ గిఫ్ట్స్‌తో సర్‌ప్రైజ్‌ చేయండి.. పక్కా థ్రిల్ అవుతారు.
New Year Gift
Follow us

|

Updated on: Dec 30, 2022 | 8:08 AM

కాల గర్భంలో మరో ఏడాది గడిసిపోతోంది. కొత్తేడాదికి వెల్‌కమ్‌ చెప్పడానికి అందరూ సిద్ధమవుతున్నారు. సెలబ్రేషన్స్‌ చేసుకోవడానికి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ప్లాన్‌లు చేసుకుంటున్నారు. టూర్‌, పార్టీలు, ఈవెంట్స్‌తో డిసెంబర్‌ 31ని ఎంజాయ్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యారు. అయితే ఇదే సమయంలో న్యూఇయర్‌కి నచ్చిన వ్యక్తులకు బహుమతులు ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. గ్రీటింగ్స్‌ మొదలు బహుమతుల వరకు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఈ కొత్త ఏడాది మీ భాగస్వామిని ఆకర్షించాలంటే కొన్ని రకాల బహుమతులు ఇవ్వాలని రిలేషన్‌ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పాట్నర్‌ను అట్రాక్ట్ చేసే ఆ గిఫ్ట్స్‌ ఏంటంటే..

* కొత్తేడాదిలో మీ భాగస్వామికి సర్‌ప్రైజ్‌ పార్టీనీ ప్లాన్‌ చేయండి. అప్పటి వరకు విషయం చెప్పకుండా ఇచ్చే పార్టీ మీ జీవిత భాగస్వామికి జీవితాంతం గుర్తుండిపోతుంది. కొత్తేడాది అందమైన క్షణాన్ని మరింత అందంగా మార్చుకోండి.

* కొత్త సంవత్సరంలో మీ పాట్నర్‌ను అలా రొమాంటిక్‌ లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్లండి. ఇది మీ ఇద్దరి మధ్య ఏకాంతాన్ని పెంచుతుంది. మనసులో ఉన్న భావాలను పంచుకోవడానికి సరైన సమయం లభిస్తుంది. దీంతో మీ బంధం మరింత బలోపేతమవుతుంది.

ఇవి కూడా చదవండి

* కొత్తేడాదిలో పాట్నర్‌కు ఎప్పటికీ మరిచిపోలేని ఓ బహుమతిని ఇవ్వండి. అది చిన్న రింగ్‌ అయినా సరే, స్మార్ట్‌ గ్యాడ్జెట్‌ అయినా సరే. ఈ మరుపురాని క్షణంలో ఇచ్చే బహుమతి వారికి ఎప్పటికీ గుర్తిండిపోతుంది.

* ఇక ఈ కొత్తేడాదిలో మీ చేతి వంటతో పాట్నర్‌ను సర్‌ప్రైజ్‌ చేయండి. స్వయంగా ఓ వంటకాన్ని చేసి వారికి అందించండి. ఇది వారి సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది.

* కొత్తేడాది ప్రారంభం రోజున జీవిత భాగస్వామితో దేవాలయల సందర్శనకు వెళ్లండి. ముఖ్యంగా మహిళలు భర్తల నుంచి ఇలాంటివి ఎక్కువగా ఆశిస్తుంటారు. కాబట్టి భార్యతో కలిసి ఆలయ సందర్శన చేయండి ఇది వారికెప్పటికీ గుర్తిండిపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..