- Telugu News Photo Gallery Check here to prepare mouth watering snacks so quickly for New Year Party 2023
New Year Snacks 2023: రుచికరమైన స్నాక్స్‌తో మీ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ సమాచారం..
క్రిస్మస్ తర్వాత సరిగ్గా వారం రోజులకు వచ్చే నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు సన్నాహాలు చేస్తున్నారు. న్యూ ఇయర్ పార్టీ అంటేనే బంధువుల, స్నేహితుల కలయిక. మరి అలాంటి కలయికలో స్నాక్స్ లేకపోతే ఎలా..?
Updated on: Dec 30, 2022 | 6:45 AM

క్రిస్మస్ తర్వాత సరిగ్గా వారం రోజులకు వచ్చే నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు సన్నాహాలు చేస్తున్నారు. న్యూ ఇయర్ పార్టీ అంటేనే బంధువుల, స్నేహితుల కలయిక. మరి అలాంటి కలయికలో స్నాక్స్ లేకపోతే ఎలా..? అందుకోసమే న్యూ ఇయర్ రోజు మీరు ఇంట్లోనే తేలికగా రుచికరమైన వెజ్ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం..

స్టఫ్డ్ చీజీ మష్రూమ్స్: తెల్లటి పెద్ద పుట్టగొడుగులలో తురిమిన పనీర్‌ను నింపడం ద్వారా మీరు ఈ టేస్టీ స్నాక్స్‌ను తయారు చేసుకోవచ్చు. వాటి రుచిని మరింతగా పెంచడానికి మీరు ఉల్లిపాయ, నల్ల మిరియాలను కూడా ఉపయోగించవచ్చు.

రాజ్మా కబాబ్: రాజ్మా కబాబ్ గురించి తెలయని వారుండరు. ఎక్కువగా పప్పు, కూరగాయలతో తయారుచేసే ఈ స్నాక్స్ రుచికి ప్రసిద్ధి. బాగా మెత్తగా ఉడకబెట్టిన బంగాళాదుంపలను గుండ్రంగా చేసుకోవాలి. తర్వాత వేయించుకోవాలి. దీని రుచిని పెంచడం కోసం అవసరమైతే ఉల్లిపాయలు, బ్రెడ్ ముక్కలను కూడా ఉపయోగించవచ్చు.

పనీర్ పాకెట్స్: తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, కొత్తిమీరను ఉపయోగించి పనీర్ పాకెట్స్ తయారు చేయవచ్చు. ఈ వంటకాన్ని అత్యంత వేగంగా చేసుకోవచ్చు.

బంగాళాదుంప కేకులు: ఈ రుచికరమైన స్నాక్ కోసం బంగాళాదుంపలను బాగా ఉడికించాలి. దాని రుచిని మరింతగా పెంచడానికి కొన్ని రకాల మసాల దినుసులను కలిపితే సరి. తర్వాత పిండిలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా చేసిన బంగాళదుంప కేకులు ఎంతో రుచిగా ఉంటాయి.





























