Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetic Foods: ‘తియ్యని’ శత్రువుపై ‘చిరు’ అస్త్రం! ఇవి తింటే మధుమేహం అలా అదుపులోకి వచ్చేస్తుంది.. మీరూ ట్రై చేయండి.

ఏమాత్రం అశ్రద్ధ చేసినా రక్తంలోకి చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోయి శరీరాన్ని నెమ్మదిగా క్షీణింపచేస్తాయి. అయితే రోజూ తృణధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Diabetic Foods: ‘తియ్యని’ శత్రువుపై ‘చిరు’ అస్త్రం! ఇవి తింటే మధుమేహం అలా అదుపులోకి వచ్చేస్తుంది.. మీరూ ట్రై చేయండి.
Diabetics
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Dec 29, 2022 | 4:25 PM

మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడంతో ఇటీవల కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అంతా ఆస్పత్రుల బాట పడుతున్నారు. ఒక్కసారి మహమ్మారి బయటపడితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే. ఏమాత్రం అశ్రద్ధ చేసినా రక్తంలోకి చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోయి శరీరాన్ని నెమ్మదిగా క్షీణింపచేస్తాయి. ఫలితంగా రోగులు చుట్టుముడతాయి. దీనిని పరిహరించడానికి చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహార అలవాట్లను మార్చుకుంటారు. రోజువారి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే రోజూ తృణధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు చూద్దాం..

ఫైబర్‌ అధికం..

షుగర్‌ వ్యాధి గ్రస్తులు కార్బోహైడ్రేట్స్‌ తక్కువగా తీసుకోవాలి. ఫైబర్‌ అధికంగా తీసుకోవాలి. ఈ చిరు ధాన్యాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలని తగ్గిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ప్రధానంగా షుగర్‌ను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడే పలు తృణధాన్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బార్లీ: బార్లీలో బీటా-గ్లూకాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర నిర్వహణలో సహాయపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఓట్ బ్రాన్: ఇందులో కరిగే ఫైబర్‌తో పాటు, మెగ్నీషియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సాయపడతాయి.

అమరాంత్‌: ఇతర తృణధాన్యాలతో పోల్చితే అధిక పోషకమైన సూడో తృణధాన్యం అమరాంత్‌. ఇందులో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ గుణాలు కూడా అధికంగా దొరకుతాయి.

రాగి: రాగి చాలా పోషకమైన మిల్లెట్. ఇది ఆవపిండిని పోలి ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. ఇది పసిపిల్లలకు మంచి ఆహారం.

బజ్రా: బజ్రాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నయం చేయడంలోనూ బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. ఇతర తృణధాన్యాలతో పోలిస్తే బజ్రాలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

జొన్న: జొన్నలో విటమిన్ కె1 పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో, ఎముకల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. జోవర్‌లోని బయోయాక్టివ్ ఫినాలిక్ సమ్మేళనాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. శరీర బరువు నియంత్రించడంతోపాటు గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..