AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arthritis Pain: ఆ నొప్పితో సచ్చిపోతున్నారా? ఇదిగో మీకో పరిష్కారం.. నిపుణుల చెబుతున్న ఈ జాగ్రత్తలు పాటించండి..

శరీర వ్యాధి నిరోధక శక్తిపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఆ వ్యాధిని ఎలా గుర్తించాలి? ఏ విధమైన చికిత్స అందించాలన్న విషయాలపై నిపుణులు చెబుతున్న విషయాలు..

Arthritis Pain: ఆ నొప్పితో సచ్చిపోతున్నారా? ఇదిగో మీకో పరిష్కారం.. నిపుణుల చెబుతున్న ఈ జాగ్రత్తలు పాటించండి..
rheumatoid Arthritis
Madhu
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 30, 2022 | 12:42 PM

Share

వయసు మీద పడుతున్న కొద్దీ చాలా రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. వాటిలో షుగర్, బీపీ ముందు వరుసలో ఉంటాయి. అయితే వీటితో పాటే ప్రమాదకరమైన మరో వ్యాధి కూడా వేధిస్తుంటుంది. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్(ఆర్ఏ). ఇది ప్రధానంగా చేతులు, కాళ్ల జాయింట్ల వద్ద వాపు, నొప్పిని కలుగుజేస్తాయి. ఫలితంగా చేయి లేదా కాలును కదపాలంటే ప్రాణం పోయే నొప్పి పుడుతుంది. ప్రధానంగా చేయి మణికట్టు, మోకాళ్లు, అరికాళ్ల జాయింట్ల వద్ద ఇది నొప్పిని కలుగు జేస్తుంది. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ప్రారంభ దశలో గుర్తించి, దీనికి సరైన చికిత్సఅందించకపోతే ఇతర శరీర భాగాలకు కూడా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, గుండె, కళ్లపై దీని ప్రభావం అధికంగా పడుతుంది. అంతే కాక మొత్తం శరీర వ్యాధి నిరోధక శక్తిపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది. ఆ వ్యాధిని ఎలా గుర్తించాలి? ఏ విధమైన చికిత్స అందించాలన్న విషయాలపై నిపుణులు చెబుతున్న విషయాలను తెలుసుకుందాం..

రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎవరికి వస్తుంది..

ఆర్ఏ సర్వసాధారణంగా వయసు పెరిగే కొద్దీ.. శరీరం పటుత్వం తగ్గుతున్న కొద్దీ వచ్చే వ్యాధి. అలాగే కొన్ని సందర్భాల్లో జన్యు సంబంధిత అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. అదే విధంగా ధూమపానం చేసే వారిలో, గర్భిణులు, ఊబకాయుల్లో ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మహిళల్లో అధిక సంఖ్యలో వస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి.

లక్షాణాలు ఏంటి?

మోకాళ్లు, మోచేతుల వద్ద జాయింట్ పెయిన్స్, వాపు, ఉదయాన్నే జాయింట్స్ వద్ద పట్టేసినట్టు ఉండటం, ఆకస్మాత్తుగా బరువు తగ్గడం, జ్వరం, నిస్సత్తువగా ఉండటం, త్వరగా అలసిపోవడం వంటివి సహజంగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రారంభ లక్షాణాలు. ఇవి రానురాను మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికి సమాయానుకూలమైన చికిత్స అవసరం లేకుంటే ఇతర శరీర భాగాలకు వ్యాప్తి చెందుతుంది.

ఇవి కూడా చదవండి

ఊపిరితిత్తతులు.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ను ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. తద్వారా దీర్ఘకాలిక దగ్గు, ఏదైనా పనిచేసినప్పుడు ఊపిరి అందకపోవడం జరుగుతుంది.

కళ్లు.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ను గుర్తించినప్పుడు కళ్లలో మంట, కళ్లు తడారిపోయినట్లు ఉండటం జరుగుతుంది. ఎక్కువగా కళ్లు ఆరిపోయినట్లు అయిపోతాయి. అలాంటి సమయంలో తప్పని సరిగా వైద్యుడిని సంప్రదించాలి.

చర్మం.. చర్మంపై దద్దుర్లు, చేతులు, కాళ్లపై అల్సర్లు రుమాటాయిడ్ ఆర్థరైటిస్ రోగులకు వచ్చే అవకాశం ఉంటుంది.

మరి చికిత్స ఏంటి..

రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించాలి. మీకున్న లక్షణాలను బట్టి వైద్యుడు మిమ్మల్ని పరీక్షించి, ఎక్స్ రే, పలు విధాల రక్త పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తారు. దీనిని దాదాపు ఆరు వారాల చికిత్స అవసరం అవుతుంది. ముఖ్యంగా దీనిని త్వరితగతిన గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం.

ఏం చేస్తే మంచిది..

రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులు పలు ఆరోగ్య కర విధానాలను అవలంభించడం ద్వారా మెరుగైన జీవినాన్ని ఆస్వాదించవచ్చు. అందులో మొదటిది ఫిజికల్ యాక్టివిటి.. ఒక వారంలో కనీసం 150 నిమిషాల పాటు శరీర వ్యాయామం అవసరం. అంటే రోజుకు అరగంట పాటు వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటివి చేయాలి. అలాగే వ్యాధిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోవాలి. మనకున్న లక్షణాలు ఏంటి? చికిత్స ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను తెలుసుకోవాలి. ధూమపానాన్ని మానేయ్యాలి. క్రమం తప్పకుండా మందులు వాడాలి. శరీర బరువు సరిపడ ఉండేట్లు చూసుకోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం..