Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RTC Discount in Buses: ప్రయాణీకులకు ఆర్టీసీ బంపరాఫర్.. ఒకేసారి నాలుగు టికెట్లు తీసుకుంటే.. అదిరిపోయే డిస్కౌంట్..

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే సంక్రాంతి కోసం ఇప్పటికే ప్రత్యేక బస్సులు...

RTC Discount in Buses: ప్రయాణీకులకు ఆర్టీసీ బంపరాఫర్.. ఒకేసారి నాలుగు టికెట్లు తీసుకుంటే.. అదిరిపోయే డిస్కౌంట్..
Apsrtc
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 31, 2022 | 11:27 AM

ఆర్టీసీ బస్సులో ప్రయాణం – సురక్షితం, శుభప్రదం అనే నినాదానికి తగినట్లుగా.. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే సంక్రాంతి కోసం ఇప్పటికే ప్రత్యేక బస్సులు ప్రకటించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి రాయితీలూ ప్రకటించింది. ప్రయాణికులు ప్రైవేటు ఆపరేటర్ల వైపు మళ్లకుండా ఇలా డిస్కౌంట్ లు ఇస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే వయోవృద్ధులకు టిక్కెట్టులో 25 శాతం రాయితీ ఇస్తోన్న ఆర్టీసీ.. ఇప్పుడు నలుగురు ప్రయాణికులు (పిల్లలు సహా) ఒకేసారి టిక్కెట్టు తీసుకుంటే చార్జీ మొత్తంలో ఐదు శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. కుటుంబాలతో కలిసి ప్రయాణం చేసే వారికి ఈ విధానం లాభదాయకం కానుంది. ఈ–వాలెట్‌ ద్వారా టిక్కెట్టును బుక్‌ చేసుకున్నా చార్జీలో ఐదు శాతం సొమ్ము తగ్గించే వెసులుబాటు కల్పించింది. రానూపోనూ టిక్కెట్టును ముందుగా రిజర్వేషన్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణం ఛార్జీలో 10 శాతం తగ్గిస్తుంది.

అయితే.. ఈ విధానాన్ని సంక్రాంతి, దసరా వంటి పండుగల సీజన్లలో నడిపే ప్రత్యేక బస్సులకూ వర్తింపజేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్నాలు, సిటీల్లో స్థిరపడిన వారందరూ సంక్రాంతికి సొంతూరుకు వస్తుంటారు. దీంతో ఈ విధానం ద్వారా అటు ఆర్టీసీకి, ఇటు ప్రయాణీకులకు ఉపయోగం కలగనుంది. మరోవైపు.. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారి కోసం 6,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. జనవరి 6 నుంచి 18 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

నేడే ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ 2025 ఫలితాలు..
నేడే ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ 2025 ఫలితాలు..
కోహ్లీ ఫేవరేట్‌కు ఊహించని షాక్.. బీసీసీఐ దెబ్బకు రిటైర్మెంట్‌?
కోహ్లీ ఫేవరేట్‌కు ఊహించని షాక్.. బీసీసీఐ దెబ్బకు రిటైర్మెంట్‌?
పీతల వేపుడిని ఇలా చేసుకోండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..
పీతల వేపుడిని ఇలా చేసుకోండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..
ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో..
ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో..
విమానాశ్రయంలో గిల్ క్యూట్ మూమెంట్.. ఫ్యాన్స్ ఫిదా!
విమానాశ్రయంలో గిల్ క్యూట్ మూమెంట్.. ఫ్యాన్స్ ఫిదా!
టెన్త్ విద్యార్ధులకు 2025 అలర్ట్.. రేపే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు!
టెన్త్ విద్యార్ధులకు 2025 అలర్ట్.. రేపే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు!
అతను చేసిన పనికి 6నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు..
అతను చేసిన పనికి 6నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు..
ఫ్యాటీ లివర్ ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఎంత ప్రమాదకరమో తెలుసా
ఫ్యాటీ లివర్ ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఎంత ప్రమాదకరమో తెలుసా
'ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం'.. RSS చీఫ్ సామాజిక ఐక్యతామంత్రం
'ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం'.. RSS చీఫ్ సామాజిక ఐక్యతామంత్రం
వేసవిలో సూర్య నమస్కారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా
వేసవిలో సూర్య నమస్కారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా