గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, గుండెకు ప్రమాదమని చాలా మంది భావిస్తారు. దీంతో తినేటప్పుడు దాన్ని పకన పెడుతుంటారు
TV9 Telugu
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తిని పచ్చసొనను పారేస్తుంటారు. కానీ పచ్చసొనతో కలిపి తింటేనే గుడ్డు సంపూర్ణ ఆహారం అవుతుందట
TV9 Telugu
కేవలం తెల్లసొన మాత్రమే తినడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎకువని నిపుణులు అంటున్నారు. తెల్లసొన ఒక ఇన్‌ఫ్లమేటరీ ప్రొటీన్. దీనికి శరీరంలో మంటను కలిగించే స్వభావం ఉంటుంది
TV9 Telugu
దీన్ని పచ్చసొనతో కలిపి తిన్నప్పుడు మాత్రమే అది సమతుల్యమైన, సంపూర్ణ ఆహారంగా మారుతుంది. పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుందనే కారణంతో దాన్ని అందరూ విలన్‌గా చూస్తారు
TV9 Telugu
కానీ, వాస్తవానికి గుడ్డులోని మెజారిటీ పోషకాలు అందులోనే ఉంటాయి. తెల్లసొనతో పోలిస్తే పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుషలంగా లభిస్తాయి
TV9 Telugu
మన శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్‌లో దాదాపు 85 శాతం మన కాలేయమే సొంతంగా తయారు చేస్తుంది. కేవలం 15 శాతం మాత్రమే మనం తినే ఆహారం ద్వారా అందుతుంది
TV9 Telugu
శరీరం తనంతట తానుగా తయారు చేసుకునేది ఆరోగ్యానికి ఎప్పుడూ హానికరం కాదు. కణాల నిర్మాణం, హార్మోన్ల ఉత్పత్తి, మెదడు పనితీరు, రోగనిరోధక శక్తి మెరుగుపడటానికి కొలెస్ట్రాల్ ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది
TV9 Telugu
ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చసొనను విస్మరించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మీరు బరువు తగ్గాలనుకున్నా, మీ కండరాలు దృఢంగా తయారవ్వాలన్నా గుడ్డును పచ్చసొనతో కలిపి పూర్తిగా తినడమే మంచిది