Weight Loss Tips : బరువు తగ్గటం భారం కాదు.. ఇలాంటి ఇంటి చిట్కాలు పాటిస్తే వెరీ ఈజీ తెలుసా..?

బరువు తగ్గడంలో సహాయపడే కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉందంటే మీరు నమ్మలేరు కదా..! కానీ, ఇది నిజమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి

Weight Loss Tips : బరువు తగ్గటం భారం కాదు.. ఇలాంటి ఇంటి చిట్కాలు పాటిస్తే వెరీ ఈజీ తెలుసా..?
Weight Chart
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 31, 2022 | 2:06 PM

బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఈజీగా బరువు తగ్గే మార్గం మీ కిచెన్ షెల్ఫ్‌లోనే ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని వంటకాల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో పసుపు ఒకటి. కానీ పసుపు మసాలాగా కాకుండా బరువు తగ్గడంలో సహాయపడే కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉందంటే మీరు నమ్మలేరు కదా..! కానీ, ఇది నిజమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి పసుపును తీసుకోవడం మంచిది.  ముఖ్యంగా స్థూలకాయముండేవారికి సాధారణంగా డయాబెటిస్ ముప్పు ఉంటుంది. పసుపు ఉపయోగించడం వల్ల డయాబెటిస్‌కు చెక్ పెట్టడమే కాకుండా ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలుగుతుంది.. పసుపులో ఉండే ఫెనోల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఒబెసిటీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వైట్ ఎడిపోజ్ టిష్యూలో వాపు తగ్గించేందుకు పనిచేస్తాయి.

పసుపు పాలు: పాలలో కొద్దిగా పసుపు కలుపుకోవడం బరువు తగ్గడానికి, మొత్తం ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది జలుబు మరియు దగ్గుకు వ్యతిరేకంగా మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

అల్లంతో పసుపు టీ: యాంటీఆక్సిడెంట్లు, మూలికల గొప్ప మూలం, అల్లం బరువు తగ్గడానికి గొప్పది. తరిగిన అల్లం వేసి నీటిని మరిగించాలి. తరవాత అందులో కాస్త పసుపు వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఈ పానీయం వడకట్టవచ్చు..లేదంటే అలాగే తాగేయవచ్చు. దీన్ని రోజూ తాగడం వల్ల బరువు తగ్గుతారు. అల్లం ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

తేనెతో పసుపు టీ: తేనెతో పసుపు టీ బరువు తగ్గించేందుకు సహయపడే ఓ గొప్ప పానీయం. తేనె ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి ఎఫెక్టివ్‌గా బరువు తగ్గడంలో సహాయపడతాయి.

దాల్చిన చెక్కతో పసుపు టీ: దాల్చిన చెక్క బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. పసుపు టీలో కొంచెం దాల్చిన చెక్కను జోడించడం వల్ల బరువు తగ్గడానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..