AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐకియాలో షాపింగ్‌ చేస్తుండగా కుప్పకూలిన వ్యక్తి.. అక్కడే ఉన్న డాక్టర్‌ ఏం చేశాడో చూడండి..

వీడియోలో ఆ వ్యక్తి నేలపై అపస్మారక స్థితిలో పడి ఉండటం మనం చూడొచ్చు. వీడియో షేర్ చేసినప్పటి నుండి రెండు లక్షలకు పైగా వీక్షణలు, తొమ్మిది వేల మంది లైక్‌లు వచ్చాయి.

ఐకియాలో షాపింగ్‌ చేస్తుండగా కుప్పకూలిన వ్యక్తి.. అక్కడే ఉన్న డాక్టర్‌ ఏం చేశాడో చూడండి..
Doctor Performs Cpr
Jyothi Gadda
|

Updated on: Dec 31, 2022 | 1:41 PM

Share

ప్రముఖ షాపింగ్‌ మాల్‌ ఐకియాలో షాపింగ్‌ చేస్తుండగా ఓ వ్యక్తి అకస్మత్తుగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన అక్కడే ఉన్న ఓ డాక్టర్‌ చాకచక్యంగా వ్యవహిరించి అతడికి ప్రాణం పోశాడు. ఉన్నట్టుండి అడ్డం పడిపోయిన వ్యక్తికి ఆ డాక్టర్ వెంటనే CPR చేసాడు. సుమారు 10 నిమిషాల పాటు సాగిన హైటెన్షన్‌ అనంతరం ఆ వ్యక్తి తిరిగి స్పృహలోకి వచ్చాడు. దాంతో అక్కడున్నవాంతా హమ్మయ్యా అనుకుని ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన బెంగళూరులోని IKEA స్టోర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను డాక్టర్ కొడుకు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరులోని ఐకియా స్టోర్‌లో షాపింగ్ చేస్తున్న వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దాంతో అక్కడే ఉన్న ఓ వైద్యుడు గమనించి రక్షించాడు. అతను సకాలంలో కార్డియోపల్మోనరీ రెససిటేషన్ లేదా CPR చేయడం ద్వారా అతడు తిరిగి కోలుకోగలిగాడు. వైరల్‌ అవుతున్న వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.వీడియోలో ఆ వ్యక్తి నేలపై అపస్మారక స్థితిలో పడి ఉండటం మనం చూడొచ్చు. డాక్టర్‌ అతనికి CPR చేస్తున్న దృశ్యం కూడా రికార్డ్‌ చేశారు. డాక్టర్‌కు తోడుగా ఇద్దరు IKEA ఉద్యోగులు కూడా సహాయం చేయడం వీడియోలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

డాక్టర్‌ కుమారు షేర్‌ చేసిన ఈ వీడియోకి మా నాన్న ఒక ప్రాణాన్ని కాపాడారు. IKEA బెంగళూరులో ఉండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా అతడు క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. వీడియో షేర్ చేసినప్పటి నుండి రెండు లక్షలకు పైగా వీక్షణలు, తొమ్మిది వేల మంది లైక్‌లు వచ్చాయి. రోగి పట్ల డాక్టర్ చేస్తున్న కృషి, అంకితభావాన్ని పలువురు కొనియాడారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!