Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి బంపర్ ఆఫర్! మళ్లీ మళ్లీ రాదు ఇలాంటి అవకాశం.. అస్సలు మిస్ చేసుకోవద్దు.

కొత్తగా పాలసీ తీసుకుంటున్న వారైనా.. ఇప్పటికే పాలసీ ఉండి రెన్యూవల్ చేయించుకునే వారైనా ఈ ఆఫర్ కు అర్హులేనని పేర్కొంది. ఆ పథకం ఏంటి? ఆఫర్ ఏంటి? దాని వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుకుందాం.

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి బంపర్ ఆఫర్! మళ్లీ మళ్లీ రాదు ఇలాంటి అవకాశం.. అస్సలు మిస్ చేసుకోవద్దు.
Health Insurance
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Dec 31, 2022 | 3:50 PM

కోవిడ్ మహమ్మారి ప్రపంచానికి చాలా పాఠాలు నేర్పింది. మూడు వేవ్ లుగా వచ్చి మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా ఆరోగ్య భద్రత లేకుండా చేసింది. అలాగే అనేక అంశాలపై అవగాహన కలిగేలా కూడా చేసింది. ఆర్థిక పరమైన విషయాలతో పాటు ఆరోగ్య పరంగా అందరికీ స్పృహ పెరిగేలా చేసింది. ఈ నేపథ్యంలో బీమా పథకాలకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో కంపెనీలు కూడా పలు ఆఫర్లు ప్రకటించి, వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. దానిలో భాగంగానే రిలయన్స్ కంపెనీ ఓ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా పాలసీ తీసుకుంటున్న వారైనా.. ఇప్పటికే పాలసీ ఉండి రెన్యూవల్ చేయించుకునే వారైనా ఈ ఆఫర్ కు అర్హులేనని పేర్కొంది. ఆ పథకం ఏంటి? ఆఫర్ ఏంటి? దాని వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుకుందాం..

ఆఫర్ ఏంటంటే..

కోవిడ్ మరో వేవ్ ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలో అందరూ హెల్త్ ఇన్స్యూరెన్స్ కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి రిలయన్స్ తన హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంపై 2.5శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ ఇన్స్యూరెన్స్ పాలసీకి ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. అలాగే ప్రజలను వ్యాక్సినేషన్ వైపు మళ్లించేందుకు కూడా ఈ పథకం దోహదం చేయగలదని వివరించింది. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న వినియోగదారులు కొత్త పాలసీకైనా లేదా పాత పాలసీ రెన్యూవల్ కైనా ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది.

ఐఆర్డీఏఐ సూచనల మేరకు..

కొన్ని దేశాల్లో మరోసారి కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ఇన్స్యూరెన్స్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(ఐఆర్డీఏఐ) అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలకు పలు సూచనలు చేసింది. హెల్త్ పాలసీలపై అవకాశం ఉన్న మేరకు ఆఫర్లు పెట్టి వ్యాక్సిన్ తీసుకున్న ఖాతాదారులకు ఉపశమనం కలిగించాలని చెప్పింది. అలాగే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్న పాలసీ హోల్డర్లకు ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చే ఆలోచన చేయాలని నొక్కి చెప్పింది. దీనిపై అవకాశం ఉంటే సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేయాలని ఐఆర్డీఏఐ సూచించింది.

ఇవి కూడా చదవండి

సెటిల్మెంట్స్ లో టాప్..

కరోనా పాన్ డెమిక్ ప్రారంభం అయిన దగ్గర నుంచి మార్చి 2022 వరకూ 2.25 లక్షల డెత్ క్లయిమ్ లను పూర్తి చేసినట్టు ఐఆర్డీఏఐ తన సంవత్సర నివేదికలో పేర్కొంది. అంతేకాక కోవిడ్ సమయంలో జనరల్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ వినియోగదారుల నుంచి పెద్ద సంఖ్యలో ట్రీట్మెంట్ సంబంధిత క్లయిమ్స్ వచ్చినట్లు ఐఆర్డీఏఐ నివేదించింది. వాటిన్నంటిని త్వరితగతిన సెటిల్ చేసినట్లు కూడా పేర్కొంది. ఇలా అన్ని కంపెనీలు కలిపి దాదాపు రూ. 25,000 కోట్ల మేరకు వినియోగదారులకు చెల్లించినట్లు వివరించింది. మొత్తం 2.25 లక్షల డెత్ క్లయిమ్ లకు గానూ రూ. 17,269 కోట్లు చెల్లించినట్లు చెప్పింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..