AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధిక ఫించనుపై EPFO స్పష్టత.. వారికి మాత్రమేనంటూ మార్గదర్శకాలు..

EPFO: అర్హులైన ఉద్యోగులకు అధిక పెన్షన్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన ప్రకటనను..

EPFO: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధిక ఫించనుపై EPFO స్పష్టత.. వారికి మాత్రమేనంటూ మార్గదర్శకాలు..
5 సంవత్సరాలలోపు ఉపసంహరణకు పన్ను విధింపు: పీఎఫ్ ఉపసంహరణ 5 సంవత్సరాలలోపు చేస్తే, అప్పుడు పన్ను విధిస్తారు. ఐదేళ్ల తర్వాత ఉపసంహరణలపై పన్ను మినహాయింపు ఉంటుంది.
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 31, 2022 | 12:18 PM

EPFO: అర్హులైన ఉద్యోగులకు అధిక పెన్షన్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన ప్రకటనను జారీచేసింది. ఉద్యోగులు అధిక పెన్షన్ పొందడానికి అర్హతలు, షరతులు, ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పులోని పేరా 44(5), 44(6) అమలుపై ఈపీఎఫ్‌వో పింఛన్ల విభాగం మార్గదర్శకాలను జారీ చేసింది. 2014 సెప్టెంబరు 1కి ముందు ఉద్యోగ విరమణ చేసి, అధిక వేతనంపై ఈపీఎఫ్‌ చెల్లిస్తూ అధిక పింఛనుకు ఆప్షన్‌ ఇచ్చిన వారికి మాత్రమే ఆ మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చింది. తీర్పులోని ఇతర అంశాలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తద్వారా లబ్ధిదారుల సంఖ్యను భారీగా కుదించారని, అతి కొద్దిమంది మాత్రమే ప్రయోజనం పొందుతారన్న ప్రచారం సాగుతోంది. ఈ మార్గదర్శకాలపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈపీఎఫ్‌ చట్టంలోని పేరా 11(3) ప్రకారం 2014 సెప్టెంబరు 1 నాటి సవరణకు ముందు గరిష్ఠ వేతన పరిమితి రూ.6500గా ఉంది. అంతకుమించి వేతనం పొందుతున్న ఉద్యోగులు దానిపై పీఎఫ్‌ చందా చెల్లించేందుకు చట్టంలోని పేరా 26(6) అనుమతిస్తోంది. అధిక పింఛను కోసం అధిక వేతనంపై పింఛను నిధి (ఈపీఎస్‌)కి ఉద్యోగి తన వాటా జమ చేసేందుకు పేరా 11(3) కింద యజమానితో కలిసి సంయుక్తంగా ఆప్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో పలు యాజమాన్యాలు ఈపీఎఫ్‌ అధికారులను సంప్రదించినా ఒప్పుకోకపోవడంతో ఈ ఆప్షన్‌ ఇవ్వలేకపోయారు.

మరోవైపు సెప్టెంబరు 1 తరువాత అధిక పింఛనులో కొనసాగేందుకు జాయింట్‌ ఆప్షన్‌ ఆరునెలల్లోగా ఇవ్వాలని కోరింది. అప్పటికే పలు యాజమాన్యాల ఆప్షన్‌ను తిరస్కరించడంతో ఉద్యోగులు, యాజమాన్యాలకు అవకాశం లేకుండా పోయింది. ఇదే విషయమై కార్మికులు, ఉద్యోగులు చేసిన అప్పీళ్లకు స్పందించి.. సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 2014 నాటి సవరణకు ముందు అధిక పింఛను కోసం అధిక వేతనంపై ఈపీఎఫ్‌కు చందా చెల్లిస్తున్నవారు ఈపీఎస్‌లో చేరేందుకు మరికొంత సమయమిచ్చింది. 4నెలల్లోగా యజమానితో కలిసి ఉమ్మడిగా ఆప్షన్‌ ఇవ్వాలని సూచించింది. ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చిన తరువాత ఈపీఎఫ్‌ ఖాతాలో నగదును ఈపీఎస్‌లోకి మళ్లించాలని తెలిపింది. ఈపీఎఫ్‌వో తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిలో మెజారిటీ ఉద్యోగులను విస్మరించింది.

2014 సెప్టెంబరు 1కి ముందు ఉద్యోగ విరమణ చేసి గరిష్ఠ వేతన పరిమితికి మించి వేతనం పొందుతూ చట్టంలోని పేరా 26 (6) ప్రకారం అధిక వేతనంపై పీఎఫ్‌ చందా చెల్లించాలి. దీంతో పాటు పేరా 11 (3) సవరణకు ముందుగా యజమానితో కలిసి సంయుక్త ఆప్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్‌ను పీఎఫ్‌ అధికారులు తిరస్కరించి ఉండాలి. ఈ మూడు అర్హతలు కలిగిన పింఛనుదారులు మాత్రమే అధిక పింఛనుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్లో ప్రత్యేక ఆప్షన్‌ ఇస్తారు. ఆయా పింఛనుదారులు సంబంధిత ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్లకు దరఖాస్తు చేయాలి. అధికంగా చెల్లించే ఈపీఎస్‌ మొత్తాన్ని ఈపీఎఫ్‌ నుంచి బదిలీ లేదా అదనపు డిమాండ్‌ నోటీసును పీఎఫ్‌ కార్యాలయం జారీ చేయనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..