AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minor PAN Card: మైనర్లకు పాన్ కార్డులు ఉంటాయని తెలుసా? ఈ సింపుల్ టిప్స్ నేరుగా ఇంటికే పాన్ కార్డ్

భారతదేశంలో ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి పరిమితి లేదు. మైనర్ నెలకు రూ.15 వేల కంటే ఎక్కువ సంపాదిస్తే ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించవచ్చు. అయితే ఐటీఆర్ ఫైల్ చెల్లించడానికి పాన్ కార్డ్ తప్పని సరి. కాబట్టి ఆదాయ పన్ను శాఖ పాన్ కార్డ్ జారీ చేయడానికి నిర్ధిష్ట వయస్సును నిర్ధారించలేదు. 

Minor PAN Card: మైనర్లకు పాన్ కార్డులు ఉంటాయని తెలుసా? ఈ సింపుల్ టిప్స్ నేరుగా ఇంటికే పాన్ కార్డ్
PAN Card
TV9 Telugu Digital Desk
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 31, 2022 | 2:44 PM

Share

పాన్ కార్డ్ ( పర్మినెంట్ ఎకౌంట్ నంబర్).. దేశంలో పన్ను చెల్లించే పౌరుడికి జారీ చేసే 10 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది అల్ఫాన్యూమరిక్ నెంబర్. అన్ని పన్నులు చెల్లించే వ్యక్తులు, వ్యాపార సంస్థలు, స్థానిక సంస్థలకు కచ్చితంగా పాన్ నెంబర్ ఉండాల్సిందే. అయితే మైనర్లకు కూడా పాన్ కార్డు ఉంటుందా? అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? మీ సందేహం నిజమే మైనర్లకు కూడా పాన్ కార్డు ఉంటుంది. నిబంధనలు ప్రకారం భారతదేశంలో ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి పరిమితి లేదు. మైనర్ నెలకు రూ.15 వేల కంటే ఎక్కువ సంపాదిస్తే ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించవచ్చు. అయితే ఐటీఆర్ ఫైల్ చెల్లించడానికి పాన్ కార్డ్ తప్పని సరి. కాబట్టి ఆదాయ పన్ను శాఖ పాన్ కార్డ్ జారీ చేయడానికి నిర్ధిష్ట వయస్సును నిర్ధారించలేదు. 

మైనర్లకు పాన్ కార్డు ఎప్పుడు అవసరం?

పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు వారి పేరుపై ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తారు. అలాంటి సమయంలో కచ్చితంగా పాన్ కార్డు కావాలి. అలాగే మన పెట్టుబడికి నామినీగా పిల్లలను పెట్టినప్పుడు కూడా పాన్ కార్డు అవసరం. పిల్లల పేరుపై జాయింట్ గా బ్యాంకు ఖాతా తెరవాలి అనుకున్నప్పుడు కూడా పాన్ కార్డు అవసరమవుతుంది. మైనర్లు వివిధ మార్గాల్లో సంపాదించినప్పుడు ఐటీఆర్ ఫైల్ చేయడానికి పాన్ కార్డు కావాలి.

మైనర్ పాన్ కార్డు ఎవరు అప్లయ్ చేయాలి?

మైనర్ కు పాన్ కార్డు కోసం ఆదాయ పన్ను శాఖ కొన్ని నిబంధనలు పేర్కొంది. మైనర్ పాన్ కార్డు కోసం అతని తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడు దరఖాస్తు చేయాలి. అయితే పిల్లల సంపాదిస్తే వారి తరఫున ఐటీఆర్ ఫైల్ చేయడం ఆ సంరక్షకుని బాధ్యత అని గుర్తుంచుకోవాలి. అయితే మైనర్ పేరుతో పాన్ కార్డు జారీ చేసినప్పుడు కార్డుపై మైనర్ ఫొటో, సంతకం ఉండదు. కాబట్టి ఆ పాన్ కార్డును గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోలేరు. మైనర్ కు 18 సంవత్సరాల వయస్సు నిండాక పాన్ కార్డ్ అప్ డేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. 

ఇవి కూడా చదవండి

పాన్ కు దరఖాస్తు చేయడం ఇలా..

  • స్టెప్ 1- ఎన్ ఎస్ డీఎల్ అధికారిక వెబ్ సైట్ క వెళ్లాలి.
  • స్టెప్ 2- ఫామ్ 49ను అప్లయ్ చేయడానికి నిబంధనలు చదవాలి.
  • స్టెప్ -3 సంబంధిత వివరాలను నమోదు చేసి, మైనర్ వయస్సుకు సంబంధించి సర్టిఫికేట్, తల్లిదండ్రుల సంతకం ఫొటోను అప్ లోడ్ చేయాలి.
  • స్టెప్ -4 రూ.107 ఆన్ లైన్ లో పేమెంట్ చేస్తే..సంబంధిత ఫామ్ డౌన్ లోడ్ అవుతుంది. 
  • స్టెప్-5 ఆ ఫామ్ ప్రూవ్స్ జత చేసిన ఫామ్ లో మెన్షన్ చేసిన అడ్రస్ కు పంపాలి.
  • స్టెప్-6 అనంతరం పాన్ కార్డు నెంబర్ కేటాయించాక.. మీ పాన్ కార్డు ఇంటికి వచ్చేస్తుంది. 

అయితే మైనర్ కు పాన్ కార్డు అప్లయ్ చేయడానికి తల్లిదండ్రుల చిరునామా, గుర్తింపు పత్రం చాలా అవసరం. ఆధార్ కార్డు లేదా బ్యాంకు పాస్ బుక్ కాపీ వంటి అవసరం కావచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి