CIBIL: ఎటువంటి రుణాలు తీసుకోకపోయినా.. కస్టమర్లకు షాక్.. మీరు బాధితులు కావచ్చు.. వెంటనే మీ సిబిల్ చేక్‌చేసుకోండి
CIBIL Score: కొంతమంది మొదటిసారి క్రెడిట్ కార్డు లేదా, రుణాల కోసం దరఖాస్తు చేస్తే.. వారి అప్లికేషన్ ఒక్కోసారి రిజక్ట్ అవ్వొచ్చు. కారణం సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేకపోవడం వల్ల రిజక్ట్ అయినట్లు బ్యాంకులు..
CIBIL Score: కొంతమంది మొదటిసారి క్రెడిట్ కార్డు లేదా, రుణాల కోసం దరఖాస్తు చేస్తే.. వారి అప్లికేషన్ ఒక్కోసారి రిజక్ట్ అవ్వొచ్చు. కారణం సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేకపోవడం వల్ల రిజక్ట్ అయినట్లు బ్యాంకులు చెబుతాయి. గతంలో ఎటువంటి రుణాలు తీసుకోకపోయినా.. పాత లోన్స్ చెల్లించలేదని, గతంలో తీసుకున్న లోన్ బకాయిలు ఉన్నాయని చూపించడం వంటి సమస్యలను కస్టమర్లు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో వీటికి సంబంధించి కస్టమర్లు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా IDFC ఫస్ట్ బ్యాంక్ , SBI కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ , పిరమల్ ఫైనాన్స్, లిక్వి లోన్స్ వంటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల్లో రుణాల కోసం దరఖాస్తు చేస్తే.. తమ CIBIL స్కోర్ తప్పుగా నమోదు చేయడంపై కొందరు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా సిబిల్ లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ వంటి సంస్థలు ఓ వ్యక్తి లేదా సంస్థ యొక్క గత రుణాల చెల్లింపులు, క్రెడిట్ కార్డు బకాయిలు వంటి వివరాలతో వారి యొక్క ఆర్థిక ప్రవర్తన యొక్క నివేదికను రూపొందిస్తాయి. సాధారణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) లైసెన్స్ పొందిన అమెరికన్ క్రెడిట్ బ్యూరో అయిన ట్రాన్స్‌యూనియన్ సిబిల్ (TransUnion CIBIL) నిర్వహించే కస్టమర్ యొక్క CIBIL స్కోర్‌ను బ్యాంకులు తనిఖీ చేస్తాయి.
గతంలో రుణాలు, క్రెడిట్ కార్డుల కోసం ఎప్పుడూ దరఖాస్తు చేయనప్పటికి.. తాము రుణాలు సక్రమంగా చెల్లించలేదని, క్రెడిట్ స్కోర్ బాగోలేదని రుణం కోసం చేసుకున్న రుణ దరఖాస్తును తిరస్కరించాయి. చెన్నై హైకోర్టులో న్యాయవాది, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు కార్తికేయన్ నటరాజన్ తన సిబిల్ నివేదికలో 27 చెల్లించని రుణాలు ఉన్నందున తనకు బ్యాంకు రుణాన్ని ఇవ్వడానికి నిరాకరించిందని ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి తాను గతంలో ఎప్పుడూ ఎటువంటి రుణం కోసం దరఖాస్తు చేయలేదని, కారు కొనుగోలు చేయడం కోసం రుణానికి బ్యాంకులో దరఖాస్తు సమర్పించినప్పుడు తన సిబిల్ నివేదికలో పాత రుణాల చెల్లింపులు చేయాలని ఉండటం చూసి షాక్‌కు గురైనట్లు తెలిపాడు. వీటి గురించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, తమ కేసులపై అప్‌డేట్ లేదని తెలిపారు.
నరేష్ ప్రకాష్ అనే మరో ఖాతాదారుడు తన సిబిల్ నివేదికలోనూ తప్పులు ఉన్నాయని, వాటి గురించి ఎస్‌బిఐ, ట్రాన్స్‌యూనియన్ సిబిల్‌కి ఫిర్యాదు చేశానని తెలిపాడు. అలాగే మరికొందరు ఖాతాదారులు కూడా తమ సిబిల్ నివేదికలో తప్పులు ఉన్నాయని ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. తమ రుణాలను పూర్తిగా చెల్లించినప్పటికి. ఇంకా బకాయిలు చూపిస్తున్నాయని మరికొంత మంది ఫిర్యాదులు చేశారు.
అసలు ఇలాంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం బ్యాంకులు, క్రెడిట్ ఏజెన్సీలు డేటా ఎంట్రీ కంపెనీలు, ఏజెన్సీలకు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిని అప్పగించడమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిబిల్ నివేదిక కోసం డేటా ఫైల్ చేస్తున్నప్పుడు బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలు అందించిన అన్ని వివరాలను తనిఖీ చేయరని, వారు కస్టమర్ పేరును తనిఖీ చేస్తారని దాంతో తనిఖీ పూర్తి చేస్తారని తెలిపారు. ఈ క్రమంలో అదే పేరున్న ఇతర వ్యక్తుల డేటాను కలిపి నివేదిక ఇస్తారని దానివల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ సిబిల్ స్కోర్ చెక్ చేసుకుని వివరాలు తప్పుగా ఉంటే సంబంధిత సంస్థకు తక్షణమే ఫిర్యాదు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకునే వీలుంటుంది. అందుకే ఈ బాధితుల జాబితాలో ఎవరైనా ఉండొచ్చు. అందుకే వెంటనే క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుని.. సమస్య ఉంటే ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.
మరిన్నిబిజినెస్ వార్తల కోసం చూడండి..