AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలాంటివి పొరపాటున కూడా పెట్టకూడదు..ఫలితం తీవ్రంగా ఉంటుంది…

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని వస్తువులను ఎప్పుడూ ఉంచకూడదని చెబుతారు. దీంతో ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. అంతే కాదు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మిదేవికి కోపం వస్తుంది.

Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలాంటివి పొరపాటున కూడా పెట్టకూడదు..ఫలితం తీవ్రంగా ఉంటుంది...
Vastu Tips
Jyothi Gadda
|

Updated on: Dec 31, 2022 | 1:54 PM

Share

ప్రస్తుత కాలంలో అందరూ వాస్తును అనుసరిస్తున్నారు. వాస్తు ఆధారంగానే ఇళ్లు, ఇంట్లోని వస్తువులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంట్లో నాటే మొక్కలు కూడా వాస్తు నియమాలకు అనుకూలంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే, తప్పుడు వాస్తు వారి ఇంటిల్లిపాదికి కష్టాలను కలిగిస్తుందనే విశ్వాసం. ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని వస్తువులు పొరపాటున కూడా పెట్టకూడదని చెబుతారు. నిజానికి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి, ప్రశాంతత దెబ్బతింటాయని నమ్ముతారు.

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారం ఇంట్లోకి ప్రవేశించే మార్గం మాత్రమే కాదు. ఇంట్లో సానుకూల, ప్రతికూల శక్తి ప్రవేశం కూడా..అందుకే ప్రజలు ఇంటి గేటును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం గురించి వాస్తులో కొన్ని ముఖ్యమైన నియమాలు సూచించారు. వాటిని పాటించే ఇంటిలోపల లక్ష్మిదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని విశ్వాసం. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని వస్తువులను ఎప్పుడూ ఉంచకూడదని చెబుతారు. అందులో భాగంగానే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ చెత్త వేయకూడదు. దీంతో ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. అంతే కాదు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మిదేవికి కోపం వస్తుంది. దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని చెబుతారు.

చీపురు… వాస్తులో పోరకే లక్ష్మిదేవి రూపంగా పరిగణించబడుతుంది. దీన్ని ఎప్పుడూ తలుపు దగ్గర పెట్టకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు అనుకోకుండా చీపురుపై అడుగు పెట్టవచ్చు. ఇది కాకుండా చీపురు వైపు ఎవరూ చూడకూడదు. కాబట్టి చీపురును ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. బదులుగా దానిని కనిపించకుండా ఉంచండి.

ఇవి కూడా చదవండి

చెప్పులు, బూట్లు… బూట్లు, చెప్పులు వంటివి ఇంటి ప్రధాన గేటు వెలుపల లేదా సమీపంలో ఉంచకూడదు. లక్ష్మిదేవి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాంటి పరిస్థితిలో లక్ష్మిదేవికి ఎదురుగా ఉన్న బూట్లు, చెప్పులు చూసి కోపం వస్తుందంటారు.. దీని వల్ల ఇంట్లో డబ్బులు పోగొట్టే అవకాశం ఉందని అంటున్నారు. చాలా మంది ప్రధాన ద్వారం బయట మనీ ప్లాంట్‌ను నాటుతుంటారు. కానీ వాస్తు ప్రకారం ఇలా చేయడం సరికాదు. మనీ ప్లాంట్‌ను సంపద మొక్కగా పరిగణిస్తారు. ఇంటి బయట నాటితే అందరి కళ్లూ దానిపైనే పడతాయి. దీంతో ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.

విద్యుత్ తీగలు లేదా స్తంభాలు.. ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ తీగలు లేదా స్తంభాలు ఉండకూడదు. ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. విద్యుత్ తీగలు, స్తంభాలు నేలకూలడంతో ఇంట్లో మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాదు ఇది ఇంటి ఆర్థిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్