ఆరోగ్యానికి మేలు చేసే పెరుగు, మజ్జిగ దాదాపు ప్రతి ఇంట్లో ఉంటాయి. ముఖ్యంగా పెరుగును చాలా వంటకాల్లో భాగం చేస్తుంటాం
TV9 Telugu
అయితే కొన్ని పదార్థాలతో పెరుగును కలిపి తీసుకోవడం వల్ల కొంతమందికి పడకపోవచ్చని, అలాంటి సందర్భాలలో అలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు
TV9 Telugu
చేపలు, పెరుగు.. ఈ రెండూ కలిపి తీసుకోకూడదన్న విషయం చాలామందికి తెలిసిందే! ఎందుకంటే ఈ రెండింటిలోనూ ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి
TV9 Telugu
తద్వారా అజీర్తి సమస్య తలెత్తుతుంది. అంతేకాదు.. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఇతర మాంసాహారంతోనూ దీన్ని కలపకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు
TV9 Telugu
మినప్పప్పుతో చేసిన పదార్థాలను పెరుగుతో కలిపి తీసుకుంటే కొంతమందిలో విరేచనాలు, కడుపుబ్బరం.. వంటి సమస్యలొస్తాయట. నూనె పదార్థాలు, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల కొంతమందిలో జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుందని చెబుతున్నారు నిపుణులు
TV9 Telugu
అలాగే ఈ కాంబినేషన్ కొందరిలో బద్ధకం, మగత వంటి వాటికి కారణమవుతుందట. పెరుగుతో తయారుచేసే రైతాలో ఉల్లిపాయలు వేయడం చాలామందికి అలవాటే
TV9 Telugu
అయితే ఈ కాంబినేషన్ కూడా కొందరికి పడకపోవచ్చంటున్నారు నిపుణులు. ఈ రెండూ కలవడం వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు, చర్మ అలర్జీలు వంటివి వచ్చే అవకాశాలున్నాయట
TV9 Telugu
కాబట్టి ఆయా పదార్థాలను పెరుగుతో కలిపి తీసుకున్నప్పుడు ఏదైనా అసౌకర్యం అనిపిస్తే వాటికి దూరంగా ఉంటమే మంచిది