కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త యాప్‌ను తీసుకురాబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 8 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు దీనితో పీఎఫ్ విత్ డ్రా ప్రక్రియ సులభతరం కానుంది. ఏప్రిల్ నాటికి అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా అర్హతగల పీఎఫ్ మొత్తాన్ని యూపీఐ ద్వారా సులభంగా విత్ డ్రా చేసుకోవచ్చు. గరిష్టంగా 75% వరకు పీఎఫ్ బ్యాలెన్స్‌ను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.