AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా ఫ్యామిలీని తిట్టారు.. ఆ సమయంలో చాలా ఏడ్చా.. విడాకుల గురించి నిహారిక ఏం చెప్పిందంటే

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని విజయాలను ఖాతాలో వేసుకుంది. నిర్మాతగానూ కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించి సక్సెస్ అయ్యింది.

నా ఫ్యామిలీని తిట్టారు.. ఆ సమయంలో చాలా ఏడ్చా.. విడాకుల గురించి నిహారిక ఏం చెప్పిందంటే
Niharika
Rajeev Rayala
|

Updated on: Feb 10, 2026 | 11:45 AM

Share

మెగా డాటర్ నిహారిక  ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. ఈ అమ్మడు కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది. ఈ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నిహారికాకు మంచి క్రేజ్ వచ్చింది. నిహారిక చేసిన షార్ట్ ఫిలిమ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తోనే నిహారిక మెల్లగా హీరోయిన్ గా అడుగులేసింది. తొలి సినిమాతో ప్రేక్షకులను అలరించింది ఈ అందాల తార. ఒక మనసులో అనే సినిమాలో నటించి మెప్పించింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ హీరోయిన్ గా అంతగా సక్సెస్ అవ్వలేదు ఈ అమ్మడు. ఆతర్వాత నిర్మాతగా మారి సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. కమిటీ కుర్రాళ్లు సినిమాతో హిట్ అందుకొని నిర్మాతగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు వరుసగా సినిమాలు నిర్మిస్తుంది నిహారిక.

ఇదిలా ఉంటే నిహారిక విడాకుల గురించి అందరికి తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డను నిహారిక వివాహం చేసుకుంది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఆతర్వాత మనస్పర్థల కారణంగా ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే నిహారిక విడాకుల పై చాలా రకాల రూమర్స్ నడిచాయి. అయితే తన విడాకుల పై ఎప్పుడూ స్పందించని నిహారిక గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. విడాకులు సమయంలో చాలా మంది రకరకాలుగా మాట్లాడారు. మాది పెద్దలు కుదురిచ్చిన పెళ్లి.. పెళ్లి తర్వాత నేను ఎంత బాదపడ్డానో నాకే తెలుసు.

ఇవి కూడా చదవండి

విడాకుల తర్వాత నేను చాలా విమర్శలు, పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు. నా క్యరెక్టర్ ను తప్పుబట్టారు. నా ఫ్యామిలీ గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. పెళ్లి అనేది చిన్న విషయం కాదు.. ఎవ్వరూ అంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకొని విడిపోవాలి అని అనుకోరు.. కానీ పెళ్లి చేసుకునే ముందే ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోవడం చాలా అవసరమని అని చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత నా పరిస్థితులు మారిపోయాయి. విడాకుల తర్వాత సమయంలో నాకు నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ గా నిలిచారు, ముఖ్యంగా మా నాన్న. నేను మానసికంగా బలంగా నిలబటానికి కారణం. విడాకుల సమయంలో నేను చాలా ఏడ్చాను. దానిలో నుంచి బయటకు రావడం చాల కష్టం. నాకు అది ఒక పాఠం నేర్పింది. జనాలను త్వరగా నమ్మకూడదు అని నేర్చుకున్నా.. మన అమ్మానాన్నలా ఎవ్వరూ చేసుకోలేరు అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది నిహారిక.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.