AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మమ్మల్ని భయపెట్టలేరు.. అమెరికాకు ఇరాన్‌ కౌంటర్

మమ్మల్ని భయపెట్టలేరు.. అమెరికాకు ఇరాన్‌ కౌంటర్

Phani CH
|

Updated on: Feb 10, 2026 | 9:45 AM

Share

అమెరికా బెదిరింపులకు భయపడబోమని, అణు కార్యక్రమాన్ని ఆపలేమని ఇరాన్ విదేశాంగ మంత్రి అన్నారు. ఇరాన్ వద్ద రసాయన ఆయుధాలు (ఫెంటానిల్‌, మెడెటోమైడిన్ వంటివి) ఉన్నాయని అమెరికా ఆందోళన చెందుతోంది. హార్ముజ్ జలసంధిలో అమెరికా నౌకలపై దాడికి ఇరాన్ ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. చర్చలు జరుగుతున్నా, ఈ ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమిస్తున్నాయి.

అమెరికా తమ యుద్ధ నౌకలను మోహరించి చేస్తున్న బెదిరింపులకు తాము భయపడబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు. బెదిరింపులతో తమ అణు కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా ఇరాన్‌ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై తమ వ్యూహాత్మక భాగస్వాములైన చైనా, రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి తెలిపారు. అమెరికాపై తమకు పెద్దగా నమ్మకం లేదని, చర్చలపై ఆ దేశం సీరియస్ గా ఉన్నట్టు కనపడటంలేదన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌‌పై హత్యాయత్నం జరిగింది. ఆనాటి ఘటనకు సంబంధించిన ఫొటోని ఇరాన్ టీవీ చూపిస్తూ ఈసారి అది గురి తప్పదని బెదిరింపుల సందేశాన్ని గతరాత్రి ప్రచారం చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ లెక్కన అమెరికా ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడి చేయవచ్చనే ఊహాగానాల వేళ కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్షిపణుల కంటే రసాయన ఆయుధాలు ఇరాన్ దగ్గర ఉండవచ్చని అమెరికా రక్షణ రంగ నిపుణుల అంచనా. క్షిపణుల కంటే వాటిని ప్రాణాంతకరమైనవిగా చెబుతారు. వాటి వల్ల భవనాలు నేలమట్టం కావు. సామూహికంగా ప్రాణ నష్టం జరుగుతుంది. ఫెంటానిల్‌ మెడెటోమైడిన్ వంటి కెమికల్స్‌తో తయారు చేసిన రసాయన ఆయుధాలు ఇరాన్ దగ్గరున్నట్లు అమెరికా చెబుతోంది. అవి శత్రు సైనికుల నాడీ వ్యవస్థపై దాడి చేస్తాయి. ఒకప్పుడు యుద్దాలు బలగాల మీద ఆధారపడేవి. ఇప్పుడు అలా కాకుండా కేవలం మిస్సైల్స్‌పై ఆధారపడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే టెక్నాలజీ వార్ అనొచ్చు. క్షిపణుల రూపంలో ఇరాన్‌ రసాయన ఆయుధాలు జార విడిచే అవకాశముందని అమెరికా భయపడుతోంది. ఇరాన్ వద్ద రసాయన ఆయుధాలు ఉన్నట్లు అమెరికా ఎలా గుర్తించింది? అమెరికా విదేశాంగ శాఖ 2024-25 నివేదికలో ఇరాన్ వద్ద రసాయన ఆయుధాలు ఉండవచ్చని ఓ అంచనా వేసింది. టెహ్రాన్ తన రసాయన ఉత్పత్తి సౌకర్యాలను పూర్తిగా ప్రకటించలేదని, ఇటీవల అల్లర్ల నియంత్రణకు జనంపై వాడిందని వాషింగ్టన్ ఆరోపిస్తోంది. ఇరాన్ కు రసాయన ఆయుధాలు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని అంటోంది. అంతేకాకుండా ఇరాన్‌ అమెరికా మధ్య యుద్ధం మొదలైతే.. అరేబియా సముద్రంలో ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్ల హోర్ముజ్‌ జలసంధిలోకి ప్రవేశించే అమెరికా యుద్ధనౌకలపై దాడికి ఇరాన్‌ ప్రణాళిక రచించిందనీ హోర్మూజ్‌ జలసంధిని దాటి అమెరికా నౌకలు బయటకు వెళ్లలేవన్న ధీమాతో ఇరాన్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్లీజ్.. మా దేశానికి రాకండి మహాప్రభో !

మద్యం లేకుండా పెళ్లి జరిపిస్తే రూ.51 వేలు గిఫ్ట్

స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్

రాజమౌళి.. నీ చర్యలు ఊహాతీతం స్వామి.. ఇది కేవలం నీ ఒక్కడికే సాధ్యం

Gold Price Today: ఫ్లాష్ మాన్ లా పైపైకి పెరుగుతున్న బంగారం,వెండి ధరలు