మద్యం లేకుండా పెళ్లి జరిపిస్తే రూ.51 వేలు గిఫ్ట్
ఉత్తరాఖండ్ సర్పంచ్ స్వీటీ రావత్ పెళ్లిళ్లలో మద్యం నిషేధానికి అద్భుత ప్రయత్నం చేస్తున్నారు. మద్యం లేకుండా వివాహం చేసుకున్న కుటుంబాలకు ₹51,000 బహుమతి ఇస్తున్నారు. యువతను మద్యం వ్యసనం నుండి రక్షించి, వృథా ఖర్చులను తగ్గించడమే ఈ పథకం లక్ష్యం. ఇప్పటికే రెండు కుటుంబాలు ఈ రివార్డును అందుకున్నాయి. ఈ సామాజిక మార్పుకు ప్రజల నుండి మంచి మద్దతు లభిస్తోంది.
వేడుక ఏదైనా చుక్క, ముక్క ఉండాల్సిందే. ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే భోజనాలు, బాజాభజంత్రీలే. ఇప్పుడు మాత్రం వివాహాల్లో మద్యం ఏరులై పారుతుంది. యువతపై ఈ అలవాటు చెడు ప్రభావం చూపడమే కాదు… పేదలకు భారంగానూ మారుతోందనే వాదనలో నిజం లేకపోలేదు. దీంతో వివాహా వేడుకల్లో మద్యం కట్టడికి ఓ గ్రామ సర్పంచ్ కొత్త ప్రయత్నం మొదలుపెట్టారు. మద్యం ఉపయోగించకుండా పెళ్లిచేసుకుంటే.. రూ.51 వేలు బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం గడుల్ గ్రామానికి చెందిన సర్పంచ్ స్వీటీ రావత్ వివాహ వేడుకల్లో మద్యం పంపిణీ చేయని కుటుంబానికి రూ.51వేలు ఇస్తానని ప్రకటించినట్టుగానే.. ఇప్పటికే రెండు కుటుంబాలకు ఆమె నగదు బహుమతి అందచేసారు. తొలిసారి గతేడాది గ్రామానికి చెందిన జ్ఞాన్‌సింగ్ తన కుమార్తె పెళ్లికి చుక్క మద్యం కూడా పంపిణీ చేయలేదు. దీంతో ఆయనకు గ్రామ సర్పంచ్ రూ.51 వేలు బహుమతి ఇచ్చారు. తర్వాత ఫిబ్రవరి 5న దేవేంద్ర సింగ్ రావత్ కూడా తన కుమార్తె వివాహం సందర్భంగా మద్యం పార్టీ ఇవ్వలేదు. ఈ రెండు శుభకార్యాలు మందు పార్టీలు లేకుండా జరిపించి, రివార్డును అందుకున్నారు. వివాహాలు వంటి శుభకార్యాల్లో మద్యం పంపిణీతో వృథా ఖర్చులు పెరిగిపోతున్నాయని, మద్యానికి యువత బానిసగా మారడానికి కారణమవుతోందని స్వీటీ అన్నారు. ఇలాంటి ధోరణిని అరికట్టేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు ప్రజల నుంచి తనకు సహకారం లభిస్తోందని తెలిపారు. సర్పంచ్ ప్రయత్నానికి జిల్లా కలెక్టర్ సహా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో తెహ్రి జిల్లాలోనూ ఇటువంటి ప్రయత్నమే జరిగింది. దేవ్‌ప్రయాగ్ గ్రామంలో మద్యం లేకుండా పెళ్లి వేడుకను నిర్వహిస్తే.. వధువుకు గిఫ్ట్‌గా రూ.10 వేలు నగదు ఇస్తామని స్థానిక పోలీసులు ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆ పోలీసులే తలో కొంత విరాళంగా పోగేసి బహుమతిగా ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం
బెర్త్ దొరకని RAC ప్రయాణికులకు.. కొంత డబ్బు వాపస్!
ఇక 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
పాపికొండల విహార యాత్రలో ఒక్కసారిగా కలకలం.. ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
మద్యం లేకుండా పెళ్లి జరిపిస్తే రూ.51 వేలు గిఫ్ట్
ప్లీజ్.. మా దేశానికి రాకండి మహాప్రభో !
అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళ.. చెక్ చేయగా
కాలువలో పడ్డ కారు.. కాపాడమంటూ ఆర్తనాదాలు.. చివరికి..
గాజు సీసాలో తిరుమల శ్రీవారి ఆలయ గోపురం
నోట్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి
అద్దాల ట్రైన్లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??

