AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్లీజ్.. మా దేశానికి రాకండి మహాప్రభో !

ప్లీజ్.. మా దేశానికి రాకండి మహాప్రభో !

Phani CH
|

Updated on: Feb 09, 2026 | 9:45 AM

Share

ప్రపంచంలో పర్యాటకులను ఆహ్వానిస్తున్న దేశాల మధ్య, యూరప్ మాత్రం "దయచేసి రావొద్దు" అని వేడుకుంటోంది. అధిక పర్యాటకం యూరప్‌కు శాపంగా మారింది. ఏటా కోట్లాది మంది సందర్శకులతో స్థానికులకు రవాణా, వసతి, కాలుష్యం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీనివల్ల నివాస ఖర్చులు పెరిగి, జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి యూరప్ దేశాలు ఇప్పుడు పర్యాటక ఆంక్షలు విధిస్తున్నాయి.

ప్రపంచంలో కొన్ని దేశాలు తమ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ.. తమ దేశానికి రావాలని ఆహ్వానం పలుకుతున్నాయి. వీసా లేని విజిట్ ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. కానీ.. యూరప్ దేశాలు మాత్రం మా దేశానికి రాకండి మహాప్రభో అని పర్యాటకుల్ని వేడుకుంటున్నాయి. ఎక్కువ స్థాయిలో పర్యాటకులు వస్తుండటంతో ప్రభుత్వాలతో పాటు స్థానికులకూ ట్రావెల్ ఓవర్ క్రౌడింగ్ సమస్యలు మొదలయ్యాయి. దీంతో ట్రావెల్ ఆంక్షలు విధిస్తున్నాయి. యూరప్ పర్యాటకంలో చారిత్రక కట్టడాలు, ఆకట్టుకునే బీచ్ లు, అక్కడి జీవన శైలి, విభిన్న సంస్కృతులు ఆకర్షిస్తాయి. పారిస్, వెనీస్, లండన్, బార్సిలోనా, రోమ్.. ఇలా యూరప్ దేశాల్లోని చాలా ప్రాంతాలు పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. గతేడాది ఏకంగా 70 కోట్ల మంది యూరప్‌ వెళ్లారంటే.. అక్కడి టూరిజం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అంతర్జాతీయ టూరిస్టులే కాకుండా.. స్థానిక పర్యాటకం తాకిడి పెద్ద సమస్యగా మారింది. దేశాల మధ్య దూరం తక్కువగా ఉండటం.. బస్సు, ట్రైన్, విమానాల్లో చాలా తక్కువ ఖర్చుతోనే ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లే వీలుండటంతో వీకెండ్ వస్తే టూరిజం ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. సోషల్ మీడియాలో కూడా డ్రీమ్ డెస్టినేషన్, బకెట్ లిస్టులలో యూరప్ దేశాలే ముందుంటున్నాయి. సమ్మర్, క్రిస్మస్, ఈస్టర్ హాలిడేస్ సమయంలో టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా డ్రీమ్ డెస్టినేషన్ అంటే యూరప్ దేశాలే ముందుంటున్నాయి. ఆదాయం భారీగానే వస్తున్నా.. స్థానికులకు రవాణా, వసతి సేవల్లో తీవ్ర ఇబ్బందులొస్తున్నాయి. కొన్ని సంస్థలు పర్యాటకులకు ఇళ్లను అద్దెకు ఇస్తుండటంతో స్థానిక ఇళ్ల అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా అక్కడి ప్రజలకు ఇళ్లు అద్దెకు దొరకని పరిస్థితి. అంతేకాదు.. కాలుష్యం, నీటికొరతతో పాటు పర్యావరణానికి హాని చేసే వ్యర్థాలు కూడా పెరుగుతుండటంతో స్థానికుల జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అందుకే తమ దేశాలకు టూరిస్టులు రావొద్దని యూరప్ దేశాలు వేడుకుంటున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం

బెర్త్ దొరకని RAC ప్రయాణికులకు.. కొంత డబ్బు వాపస్!

ఇక 27 భాషల్లో యూట్యూబ్‌ వీడియోలు

పాపికొండల విహార యాత్రలో ఒక్కసారిగా కలకలం.. ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు

Spirit: ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా కండిషన్.. అదే..

Published on: Feb 09, 2026 09:45 AM