AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఇంటిని 25 మందికి అమ్మిన ఘనుడు.. భలే మోసపోయారుగా

ఒకే ఇంటిని 25 మందికి అమ్మిన ఘనుడు.. భలే మోసపోయారుగా

Phani CH
|

Updated on: Feb 09, 2026 | 7:35 PM

Share

గురుగ్రామ్‌లో రూ.500 కోట్ల భారీ ప్రాపర్టీ మోసం వెలుగులోకి వచ్చింది. 32nd అవెన్యూ సీఈఓ ధృవ్ దత్ శర్మ ఒకే కమర్షియల్ ఫ్లోర్‌ను 25 మందికి విక్రయించి మోసం చేసిన ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ట్రామ్ వెంచర్స్ ఫిర్యాదుతో స్కాం బయటపడింది. పూర్తి డబ్బు చెల్లించినా రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఈ మోసం వెల్లడైంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. శర్మకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించారు.

గురుగ్రామ్‌లో సుమారు రూ.500 కోట్ల విలువైన భారీ ప్రాపర్టీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి, ప్రముఖ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ’32nd అవెన్యూ’ సీఈవో, డైరెక్టర్ ధృవ్ దత్ శర్మను గురుగ్రామ్ పోలీసుల ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఒకే కమర్షియల్ ఫ్లోర్‌ను దాదాపు 25 మందికి విక్రయించి మోసం చేశారన్నది ఆయనపై ప్రధాన ఆరోపణ. శుక్రవారం అరెస్ట్ చేసిన శర్మను కోర్టులో హాజరుపరచగా, విచారణ నిమిత్తం కోర్టు ఆయనకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ట్రామ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ స్కాం బయటపడింది. గురుగ్రామ్‌ సెక్టార్ 15లోని 32nd మైల్‌స్టోన్ కాంప్లెక్స్‌లో ఉన్న ఒక ఫ్లోర్‌ను రూ.2.5 కోట్లకు 2021లో తమకు విక్రయించారని, పూర్తి డబ్బు చెల్లించినా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయలేదని ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో అదే ఫ్లోర్‌ను 2022-23 మధ్యకాలంలో మరో 25 మందికి కూడా విక్రయించినట్లు తేలింది. ప్రాథమిక విచారణలో నిందితుడు కూడా ఒక ఒప్పందం చేసుకుని, దాన్ని పూర్తి చేయకుండానే అదే ఆస్తిని ఇతరులకు అమ్మినట్లు అంగీకరించారని పోలీసు వర్గాలు తెలిపాయి.అయితే, ఈ వివాదాన్ని ఇప్పటికే సామరస్యంగా పరిష్కరించుకున్నామని 32nd అవెన్యూ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ మోసం వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలను, పత్రాలను పరిశీలిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ambati Rambabu: అంబటి రాంబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్

Lok Sabha: గందరగోళం మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా

విలేపార్లే ఈస్ట్ ప్రాంతంలో అగ్నిప్రమాదం

ఆన్ లైన్ గేమింగ్ స్కామ్ పై CGST అధికారుల విచారణ

Gold Price Today: ఫ్లాష్ మాన్ లా పైపైకి పెరుగుతున్న బంగారం,వెండి ధరలు