AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో “అయ్యవార్లకు” ఐటీ జీతాలు… కోడింగ్ అక్కర్లేదు.. మంత్రం వస్తే చాలు!

​అమెరికా అనగానే మనందరికీ గుర్తొచ్చేదీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, డాలర్ల కలలు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అక్కడ ఐటీ ఇంజనీర్ల కంటే మన "అర్చకులకు" ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ​టెక్కిలకే షాకిస్తోంది పూజారుల సంపాదన. ​నమ్మబుద్ధి కావడం లేదా? కానీ ఇది నిజం. పెద్దగా చదువు లేకపోయినా, ఎలాంటి పోటీ లేకుండానే... ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు మన అయ్యవార్లు.

అమెరికాలో అయ్యవార్లకు ఐటీ జీతాలు... కోడింగ్ అక్కర్లేదు.. మంత్రం వస్తే చాలు!
Hindu Priests In America,
Sukumaar DG - Associate Editor
| Edited By: |

Updated on: Feb 10, 2026 | 8:10 AM

Share

​అమెరికా అనగానే మనందరికీ గుర్తొచ్చేదీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, డాలర్ల కలలు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అక్కడ ఐటీ ఇంజనీర్ల కంటే మన “అర్చకులకు” ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ​టెక్కిలకే షాకిస్తోంది పూజారుల సంపాదన. ​నమ్మబుద్ధి కావడం లేదా? కానీ ఇది నిజం. పెద్దగా చదువు లేకపోయినా, ఎలాంటి పోటీ లేకుండానే… ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు మన అయ్యవార్లు.

​లక్షల డాలర్ల జీతం.. ప్యాకేజీ అదుర్స్.. ​అమెరికాలోని ఆలయాల్లో అర్చకులకు ఫిక్స్‌డ్ జీతాలు మామూలుగా లేవు. ​కొత్తగా చేరేవారికే ఏడాదికి 30 వేల నుండి 45 వేల డాలర్లు (అంటే సుమారు 25-37 లక్షల రూపాయలు) ముట్టచెబుతున్నారు. ​ఇక సీనియారిటీ ఉంటే.. ఏడాదికి 80 వేల నుండి లక్ష డాలర్ల వరకు (దాదాపు 80 లక్షల రూపాయలు) జీతం తీసుకుంటున్నారు. ​జీతమే కాదు… ఇంకా చాలా ఉన్నాయి. ​ఆలయ నిర్వాహకులే ఉచితంగా ఇల్లు, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అంటే జీతంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు.

​దీనికి తోడు పండగలు, ప్రత్యేక రోజుల్లో భక్తులు ఇచ్చే “దక్షిణ” అదనం. ఇది కూడా డాలర్లలోనే ఉంటుంది. ​ప్రైవేట్ పూజలే అసలైన జాక్‌పాట్ కొట్టేస్తున్నారట. ​అమెరికాలో స్థిరపడిన మనోళ్లు కొత్త ఇల్లు కొన్నా, బిజినెస్ పెట్టినా ఘనంగా పూజలు చేస్తుంటారు. ​ఇలాంటి ఇళ్లలో చేసే సత్యనారాయణ వ్రతాలు, చిన్న పూజలకే 5 వేల నుండి 10 వేల డాలర్లు ముట్టజెబుతున్నారట. ​ఇక పెళ్లిళ్లు, పెద్ద హోమాలు అయితే.. ఏకంగా 20 వేల నుండి 40 వేల డాలర్ల దాకా డిమాండ్ చేస్తున్నారట కొందరు పూజారులు. ​ముహూర్తం బాగుంటే… నెలకి 20 లక్షలు పక్కా వస్తున్నాయట. ​మంచి రోజులు, పెళ్లి ముహూర్తాలు ఉన్న నెలల్లో.. మన పూజారుల సంపాదన అక్షరాలా రూ.10 నుండి 20 లక్షల వరకు ఉంటోందట. ఐటీ వాళ్లు కూడా ఇంత సేవ్ చేయలేరేమో!

ఈ నేపథ్యంలోనే కొందరు ​స్టూడెంట్స్ రూట్ మార్చేశారట. ​ఐటీలో ఉద్యోగం దొరకడం కష్టమైపోతుండటంతో.. అక్కడ చదువుకునే మన విద్యార్థులు “పార్ట్ టైమ్ పూజారులుగా” మారిపోతున్నారు. ​భక్తికి భక్తి.. డాలర్లకు డాలర్లు. పోటీ కూడా తక్కువ కాబట్టి వీసా కష్టాలు కూడా పెద్దగా ఉండవట. గ్రీన్ కార్డులు పొందిన అర్చకులు కూడా చాలామందే ఉన్నారు. ​మొత్తానికి అమెరికాలో ఇప్పుడు కోడింగ్ వచ్చిన వాడికంటే.. వేదం వచ్చిన వాడికే ఎక్కువ క్రేజ్ నడుస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!