Green Chicken: 31st నైట్‌ పార్టీ కోసం చికెన్‌ ప్రిపేర్‌ చేస్తున్నారా.? ఇలా కొత్తగా ట్రై చేయండి లొట్టలేసుకొని తింటారు.

కొత్తేడాదికి వెల్‌కమ్‌ చెప్పడానికి అంతా సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే 31st నైట్ పార్టీ కోసం అందరు ప్రిపేర్‌ అవుతున్నారు. మీరు కూడా నైట్ పార్టీలో చికెన్‌ ప్రిపేర్‌ చేసుకునే ప్లాన్‌లో ఉన్నారా.? అయితే చికెన్‌ కర్రీని ఎప్పుడూ ఒకేలా చేసుకుంటే కిక్‌ ఏముంటుంది చెప్పండి. ఈ ఇయర్‌ ఎండ్‌ కాస్త వెరైటీగా ప్రిపేర్‌ చేసుకోండి. మీకోసం గ్రీన్‌ చికెన్‌ రెసిపీని తీసుకొస్తున్నాం...

Green Chicken: 31st నైట్‌ పార్టీ కోసం చికెన్‌ ప్రిపేర్‌ చేస్తున్నారా.? ఇలా కొత్తగా ట్రై చేయండి లొట్టలేసుకొని తింటారు.
Green Chicken
Follow us

|

Updated on: Dec 31, 2022 | 1:59 PM

కొత్తేడాదికి వెల్‌కమ్‌ చెప్పడానికి అంతా సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే 31st నైట్ పార్టీ కోసం అందరు ప్రిపేర్‌ అవుతున్నారు. మీరు కూడా నైట్ పార్టీలో చికెన్‌ ప్రిపేర్‌ చేసుకునే ప్లాన్‌లో ఉన్నారా.? అయితే చికెన్‌ కర్రీని ఎప్పుడూ ఒకేలా చేసుకుంటే కిక్‌ ఏముంటుంది చెప్పండి. ఈ ఇయర్‌ ఎండ్‌ కాస్త వెరైటీగా ప్రిపేర్‌ చేసుకోండి. మీకోసం గ్రీన్‌ చికెన్‌ రెసిపీని తీసుకొస్తున్నాం. ఇలా గనుక కర్రీని ట్రై చేశారనుకోండి.. ఇంటికొచ్చిన అతిథులు లొట్టలేసుకొని మరీ చికెన్‌ను లాగించేస్తుంటారు. ఇంతకీ గ్రీన్‌ చికెన్‌ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి.? తయారీ విధానం ఏంటి.? స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ మీకోసం..

కావాల్సిన పదార్థాలు..

* చికెన్‌ 500 గ్రాములు

* కొత్తమీర గుప్పెడ

ఇవి కూడా చదవండి

* వెల్లుల్లి రెబ్బలు 10

* పచ్చిమిర్చి 6

* పుదీనా కొద్దిగా

* ఒక ఉల్లిపాయ

* జీడిపప్పు

* మిరియాల పొడి

* పసుపు

* పెరుగు, గరం మసాలా (అర టీస్పూన్), నూనె

తయారీ విధానం..

ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అనంతరం మిక్సీ జార్‌లో కొత్తిమీర, తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి , పుదీనా, ఫ్రై చేసిన ఉల్లి ముక్కలు, జీడిపప్పును వేసి పేస్టులా గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్‌ తీసుకొని కడిగి పెట్టుకున్న చికెన్‌కు ఉప్పు, నల్ల మిరియాల పొడి 1 టీస్పూన్‌, అర టీస్పూన్‌ పసుపు, పెరుగు వేయాలి తర్వాత అంతకు ముందు ప్రిపేర్‌ చేసిపెట్టుకున్న గ్రీన్‌ పేస్టును వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం ఒక గంటపాటు పక్కన పెట్టుకోవాలి.

తర్వాత ఒక ప్యాన్‌ను తీసుకొని స్టౌవ్‌పై పెట్టుకోని నూనె వేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత చికెన్‌ మొత్తం వేసి బాగా కలపాలి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లెమ్‌లో 15 నిమిసాలు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకొని అవసరం మేరకు ఉప్పును కలుపుకోవాలి. మళ్లీ కాసేపు సిమ్‌లో ఉడికించుకోవాలి. అంతే.. టేస్టీ టేస్టీ గ్రీన్‌ చికెన్‌ కర్రీ రడీ అయినట్లే. ఈ కర్రీని రైస్‌తో పాటు చపాతీ, పూరీ, పరోటా లాంటి వాటివి పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అవుతుంది. కేవలం టేస్ట్‌ పరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీర జీర్ణక్రియకు, పుదీనా ఒంట్లో వేడిని తగ్గిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..