Urvashi Rautela: ఊర్వశి రౌతేలా తాజా ట్వీట్‌పై నెట్టింట గుసగుసలు.. ఆమె ట్వీట్‌ ఎవరినుద్దేశించో..?

సోషల్‌ మీడియా వేదికగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు, పంత్‌కు గత కొంతకాలంగా పరోక్ష యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే తాజాగా ఊర్వశి రౌతేలా ఓ ట్వీట్ చేశారు.

Urvashi Rautela: ఊర్వశి రౌతేలా తాజా ట్వీట్‌పై నెట్టింట గుసగుసలు.. ఆమె ట్వీట్‌ ఎవరినుద్దేశించో..?
Urvashi Rautela Tweet
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 31, 2022 | 4:21 PM

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున (డిసెంబర్‌ 30) ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అతను ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొడుతూ అల్లంత దూరాన పడింది. అనంతరం కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. పంత్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన పంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదిలాఉంటే డిసెంబర్‌ 30న వరుసగా బ్యాడ్‌ న్యూస్‌లు వినాల్సి వచ్చింది. ప్రధాని తల్లి మరణం, పీలే మృతి, రిషబ్‌ పంత్‌ కార్‌ యాక్సిడెంట్‌.. అదృష్టవశాత్తు క్రికెటర్‌ రిషబ్‌పంత్‌కు ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పంత్‌ త్వరగా కోలుకోవాలని పలువురు అభిమానులు ఆకాంక్షస్తున్నారు.

ఐతే సోషల్‌ మీడియా వేదికగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు, పంత్‌కు గత కొంతకాలంగా పరోక్ష యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే తాజాగా ఊర్వశి రౌతేలా ఓ ట్వీట్ చేశారు. ‘మీరు, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను’ అనేది ఆ ట్వీట్‌ సారాంశం. ఐతే ఈ ట్వీట్‌కు ఊర్వశి రౌతేలా ఎవరి పేరును కూడా ట్యాగ్‌ చేయలేదు. దీంతో సదరు ట్వీట్‌ రిషబ్‌పంత్‌ను ఉద్ధేశించి పెట్టిందో లేక మరెవరి గురించి పెట్టిందో తెలియక నెటిజన్లు కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు. దీంతో నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు ఊహించేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మృతి పట్ల ఊర్వశి రౌతేలా సానుభూతి తెలిపేందుకు ఈ ట్వీట్‌ చేశారని కొందరు అనుకుంటున్నారు. కాదు.. కాదు.. ఫుట్‌బాల్‌ దిగ్గజ క్రీడాకారుడు పీలే మృతి పట్ల సంతాపం తెలిపారంటూ మరికొందరు ఊహించుకుంటున్నారు. ఐతే ఎక్కువ మంది యూజర్లు మాత్రం రిషబ్‌పంత్‌, అతని కుటుంబం కోసం ఊర్వశి ఈ ట్వీట్ చేసిందని విశ్వసిస్తున్నారు. ఈ ట్వీట్‌ చేయడానికి కొన్ని గంటల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ప్రేయింగ్‌ ఫర్‌ యూ (నీ కోసం ప్రార్థిస్తున్నా)’ అనే క్యాప్షన్‌తో, వైట్‌ కలర్‌ లవ్‌ సింబల్‌, పావురం ఎమోజీలను జతచేశారు. ఇక ఈ పోస్ట్‌పై కూడా నెట్టింట చర్చ సాగుతోంది. ఇక సినిమాల విషయాని కోస్తే చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘వాల్తేరు వీరయ్య’తో ఊర్వశి రౌతేలా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో ఆమె ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించారు. వచ్చే ఏడాది జనవరి 13న వాల్తేరు వీరయ్య థియేటర్లలో విడుదల కానుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.