కూతుళ్లే.. కొడుకులై తండ్రికి అంతిమ వీడ్కోలు !
నలుగురు కుమార్తెలు తమ తండ్రి అంత్యక్రియలు నిర్వహించి, "కొడుకు ఉంటేనే పున్నామ నరకం తప్పుతుంది" అనే మూఢనమ్మకాన్ని, లింగ వివక్షను బద్దలు కొట్టారు. ఎన్టీఆర్ జిల్లా నరసాపురం గ్రామంలో జరిగిన ఈ ఘటన సమాజానికి ఒక కొత్త సందేశాన్నిచ్చింది. ఆడపిల్లలు ఏ విషయంలోనూ తక్కువ కాదని, బాధ్యతలను అంతే సమర్థంగా నిర్వర్తించగలరని చాటిచెప్పారు. ఈ సాహసోపేత చర్య అందరి ప్రశంసలు అందుకుంది, సామాజిక మార్పుకు నాంది పలికింది.
సమాజంలో ఇప్పటికీ “కొడుకు ఉంటేనే పున్నామ నరకం తప్పుతుంది.. అంతిమ సంస్కారాలకు వారసుడు కావాలి” అనే మూఢనమ్మకాలు బలంగా ఉన్నాయి. ఈ లింగ వివక్షకు, మూఢనమ్మకానికీ ధీటుగా సమాధానమిచ్చారు ఓనలుగురు అక్కాచెల్లెళ్లు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలో జరిగిన ఒక ఘటన ఈ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలకు చెంప పెట్టులా నిలిచింది. నలుగురు కుమార్తెలు తమ కన్న తండ్రి పాడె మోసి, అంతిమ సంస్కారాలు నిర్వహించి ‘ఆడపిల్లలు ఏ విషయంలోనూ తక్కువ కాదు’ అని చాటిచెప్పారు. నరసాపురం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూసారు. 75 ఏళ్ల గంధం సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎంతో దయా, దానగుణం కలిగిన వ్యక్తిగా గ్రామంలో మంచి పేరుతెచ్చుకున్నారు. కాగా, గత కొంతకాలంగా సుబ్రహ్మణ్యేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు నలుగురు కుమార్తెలు తప్ప కుమారులు లేరు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు బంధువుల్లోని పురుషులు ముందుకొస్తుంటారు. కానీ, ఆ నలుగురు కుమార్తెలు తమ తండ్రిపై ఉన్న ప్రేమను, బాధ్యతను చాటుకుంటూ తామే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని ముందుకొచ్చారు. తమకు జీవితాన్నిచ్చిన తండ్రి ఇక లేడనే బాధను గుండెల్లో మోస్తూ.. కన్నీటి పర్యంతమవుతూనే, నలుగురు సోదరీమణులు తండ్రి పాడెను భుజాన మోసి స్మశాన వాటిక వరకు తీసుకెళ్లారు. తమకు ఒక సోదరుడు ఉంటే తండ్రి అంత్య క్రియలు ఎలా చేసేవాడో అలాగే నలుగురు కుమార్తెలు ఆ తండ్రికి కొడుకులుగా మారి అంతిమ క్రియలు నిర్వహించారు. ఈ దృశ్యం చూసి అక్కడి గ్రామస్తులు, బంధువులు కంటతడి పెట్టారు. ఆడపిల్లల ధైర్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి సాహసాన్ని అభినందించారు. ఈ ఘటన సమాజంలో ఒక కొత్త మార్పుకు నాందిగా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్లీజ్.. మా దేశానికి రాకండి మహాప్రభో !
మద్యం లేకుండా పెళ్లి జరిపిస్తే రూ.51 వేలు గిఫ్ట్
స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్
రాజమౌళి.. నీ చర్యలు ఊహాతీతం స్వామి.. ఇది కేవలం నీ ఒక్కడికే సాధ్యం
Gold Price Today: ఫ్లాష్ మాన్ లా పైపైకి పెరుగుతున్న బంగారం,వెండి ధరలు
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

