Viral: వామ్మో.. టేకాఫ్ సమయంలో అదుపు తప్పిన హెలికాప్టర్.. క్షణాల్లోనే తునాతునకలు.. షాకింగ్ వీడియో..

సోషల్‌ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి.

Viral: వామ్మో.. టేకాఫ్ సమయంలో అదుపు తప్పిన హెలికాప్టర్.. క్షణాల్లోనే తునాతునకలు.. షాకింగ్ వీడియో..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 29, 2022 | 9:57 PM

సోషల్‌ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా.. నెట్టింట అలాంటి ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. హెలికాప్టర్‌ను నియంత్రించడంలో ఫైలట్‌ విఫలమవ్వడంతో.. ఘోర ప్రమాదం జరిగింది. చాపర్‌ తునాతునకలయ్యింది. టేకాఫ్ అయిన వెంటనే హెలికాప్టర్‌ను నియంత్రించడంలో పైలట్ విఫలం కావడం.. ఆ తర్వాత చాపర్ శిథిలాలు చెల్లా చెదురుగా పడటం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే చాపర్ క్రాష్ అయిన సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. కానీ, ఈ షాకింగ్ వీడియో మాత్రం సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో తెగ వైరల్ అవుతోంది.

ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఒక చిన్న హెలిప్యాడ్‌పై పార్క్ చేసిన హెలికాప్టర్‌ను రైడ్ చేయడానికి పైలట్ ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తుంది. అయితే, పైలట్ ఇంజిన్‌ను స్టార్ట్‌ చేసిన తర్వాత అనుకున్నట్లుగా టేకాఫ్ అవలేదు. అనంతరం హెలికాప్టర్‌ అటుఇటు ఊగుతుంది. క్రమంగా పైలట్ ఛాపర్‌పై నియంత్రణ కోల్పోతాడు. ప్రస్తుతం వైరల్‌గా మారిన వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.

ఇవి కూడా చదవండి

టేకాఫ్ సమయంలో హెలికాప్టర్‌ను నియంత్రించడంలో పైలట్ విఫలం అయిన తరువాత ఏమి జరిగిందో వైరల్ వీడియోలో చూడండి..

ఒక చిన్న హెలిప్యాడ్‌లో హెలికాప్టర్ నిలిపి ఉంచారు. దాని సమీపంలో మరో రెండు కార్లు కూడా పార్క్ చేసి ఉన్నాయి. అయితే చాపర్ టేకాఫ్ సమయంలో పట్టుతప్పి తునాతునకలయ్యింది. ఈ షాకింగ్‌ వీడియోను లాన్స్ అనే ట్విటర్ యూజర్ షేర్‌ చేయగా.. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?