Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year 2023: ఇప్పటికే ఆ ప్లేస్ లో అడుగు పెట్టిన 2023.. న్యూ ఇయర్ వేడుకలను మొదటి జరుపుకున్నప్లేస్ ఏమిటో తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా, ప్రజలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో  సంతోషంగా గడుపుతారు. రాబోయే సంవత్సరానికి శుభాకాంక్షలు చెబుతారు.. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 2023లోకి అడుగు పెట్టాయి. ప్రపంచ దేశాలు దాదాపు  25 గంటల వ్యవధిలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సాంప్రదాయ వేడుకలతో రెడీ అవుతున్నారు. 

New Year 2023: ఇప్పటికే ఆ ప్లేస్ లో అడుగు పెట్టిన 2023.. న్యూ ఇయర్ వేడుకలను మొదటి జరుపుకున్నప్లేస్ ఏమిటో తెలుసా..
New Year Eve
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2022 | 5:42 PM

మరికొన్ని గంటల్లో 2022 సంవత్సరానికి గుడ్ బై చెప్పి.. కొత్త సంవత్సరం 2023కి స్వాగతం చెప్పడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు రెడీ అవుతున్నారు. అయితే కొన్ని దేశాల్లో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల గురించి ఆందోళనల మధ్య భారతదేశం సహా ప్రపంచం కొత్త ఏడాదికి వేడుకలతో వెల్కమ్ చెప్పనున్నాయి. పార్టీలతో మోత మోగించబోతున్నాయి. ఆధునిక గ్రెగోరియన్ క్యాలెండర్‌కు అనుగుణంగా ఏటా జనవరి 1న నూతన సంవత్సర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా, ప్రజలు తమ కుటుంబ సభ్యులు,  స్నేహితులతో  సంతోషంగా గడుపుతారు. రాబోయే సంవత్సరానికి శుభాకాంక్షలు చెబుతూ.. గడిచిన సంవత్సరానికి వీడ్కోలు చెబుతారు.. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 2023లోకి అడుగు పెట్టాయి. ప్రపంచ దేశాలు దాదాపు  25 గంటల వ్యవధిలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సాంప్రదాయ వేడుకలతో రెడీ అవుతున్నారు.

కొత్త సంవత్సరం అర్ధరాత్రి నుండి ప్రారంభమవుతుంది.. అయితే ప్రపంచంలోని ప్రజలు అందరూ సరిగ్గా అదే సమయంలో జరుపుకోరు. ఏ దేశం కొత్త సంవత్సరాన్ని మొదటగా జరుపుకుంటుందో తెలుసా.. ఇప్పటికే  చాలామంది 2022కి వీడ్కోలు పలుకుతున్నారు..  కొత్త ఆశతో తమ జీవితంలో వెలుగులు నింపాలని 2023ని స్వాగతిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2023కి కౌంట్‌డౌన్ అర్ధరాత్రి కంటే ముందే ప్రారంభమైనప్పటికీ.. అందరూ ఒకే సమయంలో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడం లేదు..

ఏ దేశం ముందుగా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటుందంటే.. 

ఇవి కూడా చదవండి

చాలా మంది న్యూ ఇయర్‌ జరుపుకునే మొదటి దేశంగా ఆస్ట్రేలియా వైపు చూస్తారు కానీ ఇది అలా కాదు. నూతన సంవత్సర వేడుకలను జరుపుకునే మొదటి ప్రదేశం ఓషియానియా. చిన్న పసిఫిక్ ద్వీప దేశాలైన టోంగా, సమోవా , కిరిబాటి నూతన సంవత్సరాన్ని స్వాగతించే మొదటి దేశాలు, ఇక్కడ జనవరి 1 ఉదయం 10 GMT లేదా 3:30 pm IST కాలమానం ప్రకారం ఇక్కడ.. కొత్త సంవత్సరం..  డిసెంబర్ 31నే ప్రారంభమవుతుంది.

కిరిటిమాటి ద్వీపం – దీనిని క్రిస్మస్ ద్వీపం అని కూడా పిలుస్తారు. మధ్య పసిఫిక్ మహాసముద్రంలో 10 ఇతర జనావాసాలు లేని దీవుల్లో ఒకటి. 2023 ఇక్కడే అడుగు పెట్టింది. హవాయికి నేరుగా దక్షిణంగా ఉన్నప్పటికేఈ.. కిరిటిమటి ద్వీపం దాదాపు ఒక రోజు  ముందుగానే నూతన సంవత్సరాన్ని జరుపుకుంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..