Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dream-11: సెలవు రోజుల్లో ఉద్యోగిని డిస్టర్బ్ చేస్తే.. రూ. 1 లక్ష జరిమానా.. కొత్త రూల్ తెచ్చిన కంపెనీ

సెలవు రోజున కూడా, ఉద్యోగులకు సీనియర్లు లేదా కంపెనీ మేనేజర్ల పనిని చేయమని కాల్ లేదా మెసేజ్ పంపితే వారికి భారీగా జరిమానా విధించబడుతుంది. ఈ జరిమానా మొత్తం లక్ష రూపాయల వరకు ఉంటుంది. ఈ ఆసక్తికరమైన విధానాన్ని అమలు చేస్తున్న కంపెనీ పేరు డ్రీమ్ 11.

Dream-11: సెలవు రోజుల్లో ఉద్యోగిని డిస్టర్బ్ చేస్తే.. రూ. 1 లక్ష జరిమానా..  కొత్త రూల్ తెచ్చిన కంపెనీ
Dream11
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2022 | 6:26 PM

ఆఫీసుకు సెలవు వస్తే.. ఆ ఉద్యోగి రెస్ట్ తీసుకోవాలనో.. లేదా తమ కుటుంబంతో సంతోషంగా గడపాలనో భావిస్తాడు. అయితే సెలవు రోజుల్లో కూడా సాధారణంగా సీనియర్లు లేదా మేనేజర్లు తమ కింద ఉద్యోగులను పని చేయమని ఒత్తిడి చేయడం కనిపిస్తుంది. ఇలాంటి బాధిత ఉద్యోగులు అనేక మంది ఉండవచ్చు. సెలవుల్లో ప్రశాంతంగా గడపాలని.. ఎక్కడైనా వెళ్లి ఎంజాయ్ చేయాలని కొందరు భావిస్తే.. మరికొందరు అసలు ఏపనీ చేయకుండా ఇంట్లో నుంచి బయటకు రాకుండా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. అందుకు అనుగుణంగా తమ సెలవులను ప్లాన్ చేసుకుంటారు కూడా..అలాంటి సెలవు రోజుల్లో కూడా పని చేయమని అడిగితే..  అప్పుడు ఆ ఉద్యోగికి చాలా చిరాకు వస్తుంది. ఒకొక్కసారి ఎందుకు ఈ ఉద్యోగం అనిపిస్తుంది కూడ.. అయితే ఓ కంపెనీ ఉద్యోగుల బాధలను అర్ధం చేసుకున్నట్లుంది.. తాజాగా సరికొత్త విధాన్ని అమల్లోకి తీసుకుని వచ్చింది

ఈ విధానం ప్రకారం, ఉద్యోగులకు సెలవు రోజుల్లో కంపెనీ సీనియర్లు లేదా మేనేజర్ల పనిని చేయమని కాల్‌లు లేదా సందేశాలు పంపిస్తే.. వారికి భారీగా జరిమానా విధించబడుతుంది. ఈ జరిమానా మొత్తం లక్ష రూపాయల వరకు ఉంటుంది. ఈ ఆసక్తికరమైన పాలసీని అమల్లోకి తీసుకుని వచ్చిన కంపెనీ పేరు డ్రీమ్ 11. ఇది ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్. ఉద్యోగులు తమ సెలవులను సంతోషంగా గడిపేందుకు, ఎంజాయ్ చేసేందుకు వీలుగా ఆయన ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఇప్పుడు మీ సెలవులను సంతోషంగా అనుభవించండి 

ఇవి కూడా చదవండి

కంపెనీ దీనికి ‘అన్‌ప్లగ్ పాలసీ’ అని పేరు పెట్టింది. ఈ విధానం వలన తమ కంపెనీలోని ఉద్యోగులకు సెలవు రోజుల్లో ఎలాంటి వేధింపులు ఉండవని చెప్పారు. పనికి సంబంధించిన ఇమెయిల్ పంపబడదు లేదా ఎటువంటి మెసేజ్,  లేదా కాల్ చేయరు.  తమ సెలవుల్లో ఉద్యోగులు కంపెనీ పని నుండి పూర్తిగా తమను తాము వేరు చేసుకోవచ్చు.

మరిన్ని అంతర్జాయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..