Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పేకాటరాయుళ్లకు కావాల్సింది ఇదికదా.. ఈ కొత్త టెక్నాలజీ చూస్తే ఫిదా అయిపోతారు..

Latest Viral Video: దినదినాభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని జనాలు బాగా అందిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో ప్రతీ పనికి న్యూ టెక్నాలజీతో పని చేసే యంత్రాలను వినియోగిస్తున్నారు.

Viral Video: పేకాటరాయుళ్లకు కావాల్సింది ఇదికదా.. ఈ కొత్త టెక్నాలజీ చూస్తే ఫిదా అయిపోతారు..
Play Cards
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 31, 2022 | 5:13 PM

దినదినాభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని జనాలు బాగా అందిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో ప్రతీ పనికి న్యూ టెక్నాలజీతో పని చేసే యంత్రాలను వినియోగిస్తున్నారు. ఇళ్లూ ఊడ్చడానికి, గిన్నెలు కడగడానికి, బట్టలు ఉతకడానికి ఇలా ఒకటేటిమి స్నానం మొదలు ప్రతి పనికి టెక్నాలజీని ఓ రేంజ్‌లో వాడేసుకుంటున్నారు జనాలు. ప్రజల అభిరుచికి తగ్గట్లే.. ప్రముఖ కంపెనీలు సైతం నూతన ఆవిష్కరణలను తీసుకువస్తున్నాయి. తాజాగా ఓ ఆవిష్కరణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది చూసి అబ్బరబిడ్డ ఇది కదా మనకు కావాల్సింది అని కొందరు తెగ మురిసిపోతున్నారు. మరి ఇంతకీ ఆ ఆవిష్కరణ ఏంటి? ఎవరు అంతగా మురిసిపోతున్నారు? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది సరదాగానో, బెట్టింగ్ పెట్టో, వ్యవసనంగానో.. ఏదో రూపంపలో పేకాట(ప్లే కార్డ్స్’ ఆడుతుంటారు. కొందరు టైమ్‌పాస్ కోసం ఆడితే.. మరికొందరు డబ్బుకోసం బెట్టింగ్స్ పెట్టి ఆడుతుంటారు. అయితే, పేకాట ఆడాలంటే.. అందులోని ప్లేయర్స్‌కి కార్డ్స్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఆటగాళ్లలో ఎవరో ఒకరు ఆ కార్డ్స్‌ని పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు వచ్చిన న్యూ డివైజ్‌తో వారికి పెద్ద పని తప్పినట్లే అయ్యింది. అవును.. ఆ డివైజ్‌లో ప్లేకార్డ్స్ సెట్ చేసి పెడితే.. అదే పంపిణీ చేస్తుంది. ప్లేయర్స్‌కి ఆ డివైజే కార్డ్స్ వేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ న్యూ డివైజ్‌కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. పేకాటరాయుళ్లు ఈ డివైజ్‌ను చూసి తెగ మురిసిపోతున్నారు. ఇదికదా మనకు కావాల్సింది అంటూ సంబరపడిపోతున్నారు. మొత్తానికి కొత్త టెక్నాలజీతో కనిపెట్టిన ఈ న్యూ డివైజ్‌ను చూసి మన కోసం వచ్చిన దేవత అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.. ఆ కొత్త డివైజ్‌ను చూడండి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..