Aadhaar: మీ ఆధార్‌కార్డు జిరాక్స్‌లను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారా? జాగ్రత్త.. కేంద్రం తాజా సూచనలు ఇవే..

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక జిరాక్స్ కాపీలకు బదులు ఆధార్‌కార్డులనే నేరుగా ఫొటోలు తీసి ఎవరెవరికో పంపిస్తున్నాం. ఐతే తాజాగా కేంద్రం ఆధార్‌కార్డు గురించి కీలక సూచనలు జారీ చేసింది..

Aadhaar: మీ ఆధార్‌కార్డు జిరాక్స్‌లను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారా? జాగ్రత్త.. కేంద్రం తాజా సూచనలు ఇవే..
Aadhaar Update
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 31, 2022 | 4:43 PM

నేటి కాలంలో ఎటువంటి సేవలు పొందాలన్నా ఆధార్‌ తప్పనిసరైంది. బ్యాంక్‌ ఖాతా తెరవాలన్నా, మొబైల్‌ సిమ్‌ తీసుకోవాలన్నా, ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్‌ నెంబర్‌ అడుగుతున్నారు. దీంతో చేసేదిలేక జిరాక్స్ సెంటర్లలో కుప్పలుతెప్పలుగా ఆధార్‌కార్డు కాపీలను తీయిస్తున్నాం. ఇక చేతిలో స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక జిరాక్స్ కాపీలకు బదులు ఆధార్‌కార్డులనే నేరుగా ఫొటోలు తీసి ఎవరెవరికో పంపిస్తున్నాం. ఐతే తాజాగా కేంద్రం ఆధార్‌కార్డు గురించి కీలక సూచనలు జారీ చేసింది.

ఆధార్‌కార్డు, వాటి కాపీలను ఎక్కడపడితే అక్కడ వదిలేయొద్దని ప్రజలకు హెచ్చరికలు చేస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. ఇలా చేయడం వల్ల మన విలువైన సమాచారం ఇతరుల చేతిలోకి తేలిగ్గావెళ్లిపోతుందట. దీంతో ఆధార్‌ నెంబర్‌ను సోషల్‌మీడియా, ఇతర బహిరంగ వేదికల్లో ఉంచవద్దని కేంద్రం సూచిస్తోంది. అలాగే ఆధార్‌కు అనుసంధానం చేసిన మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీలను కూడా ఎవరితోనూ పంచుకోవద్దని పేర్కొంది. ప్రతి ఆధార్‌కార్డుదారు తన ఈమెయిల్‌ను ఆధార్‌కు అనుసంధానం చేసుకోవాలని సూచించింది. ఆధార్‌నెంబర్‌ను ఇతరులతో పంచుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెల్పింది. ఇక ఎవరికైనా ఆధార్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తితే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1947ను సంప్రదించాలని, 24 గంటల్లో ఎప్పుడైనా సంప్రదించవచ్చని కేంద్రం సూచనలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?