Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: అందుకే నేను స్వెట్టర్ వేసుకోను.. టీ-షర్ట్‌పై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రాహుల్ గాంధీ..

, ఎముకలు కొరికే చలిలో కూడా రాహుల్ టీ-షర్ట్ ధరించి నడుస్తుండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ ధరించిన టీ-షర్ట్ లపై బీజేపీ విమర్శలు చేస్తుండగా.. కాంగ్రెస్‌ కూడా గట్టి కౌంటర్ ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో టీషర్ట్ రచ్చపై తాజాగా రాహుల్ గాంధీ స్పందించారు.

Rahul Gandhi: అందుకే నేను స్వెట్టర్ వేసుకోను.. టీ-షర్ట్‌పై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రాహుల్ గాంధీ..
Rahul Gandhi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 31, 2022 | 4:49 PM

ఉత్తరాది రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కూడా ఉత్తరాదినే కొనసాగుతోంది. అయితే, ఎముకలు కొరికే చలిలో కూడా రాహుల్ టీ-షర్ట్ ధరించి నడుస్తుండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ ధరించిన టీ-షర్ట్ లపై బీజేపీ విమర్శలు చేస్తుండగా.. కాంగ్రెస్‌ కూడా గట్టి కౌంటర్ ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో టీషర్ట్ రచ్చపై తాజాగా రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘చలికాలం అంటే నేను భయపడను కావున నేను స్వెటర్ ధరించను. టీ-షర్టుపై ఎందుకంత చర్చ.. పెద్దగా చలి అనిపించలేదు.. అందుకే స్వెటర్‌ వేసుకోలేదు. ఒకవేళ చలి ఎక్కువైతే స్వెటర్‌ గురించి ఆలోచిస్తా’’ అంటూ రాహుల్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఈ క్రమంలో నో సప్లిమెంటరీ క్వశ్చన్ అంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అనడంతో రిపోర్టర్ మరో ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. అడగనివ్వండి.. ప్రధాని మోడీ మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించరు.. కావున నేను కూడా దానికి సంబంధించిన రెండు మూడు ప్రశ్నలు మీకు ఇస్తానంటూ సరదాగా పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో ఉత్సాహంగా ఉండటం వెనుక ఉన్న సీక్రెట్‌ గురించి ప్రశ్నించగా.. టీషర్ట్, దీనికి సంబంధించి తర్వాత ఓ వీడియో విడుదల చేస్తానంటూ తెలిపారు. భారత్‌ జోడో యాత్రకు ప్రస్తుతం స్వల్ప విరామం ప్రకటించిన రాహుల్.. శనివారం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై పలు విమర్శలు గుప్పించారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్ నా గురువు..

భారత్ జోడో యాత్రకు భారీగా ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ను తాను గురువుల్లా భావిస్తానంటూ పేర్కొన్నారు. వారిని చూసే ఎలా ఉండకూడదో.. ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకున్నానంటూ ఎద్దెవా చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్రను ప్రారంభించినప్పుడు ఒక సాధారణ పాదయాత్ర లాగే భావించానని, అయితే అడుగడుగున బీజేపీ నేతలు తమ యాత్రను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

భారత్ జోడో యాత్రకు ఆటంకం కలిగించేందుకు ఏ కారణం లేకపోవడంతో భద్రతా ఉల్లంఘన పేరుతో తనపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్‌ జోడో యాత్రను తాను కేవలం యాత్రగానే ప్రారంభించానని.. కానీ, ఇది ప్రజల గొంతుక అవుతుందని ఇప్పుడు తెలుసుకున్నామన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాని.. వారు ఎంతగా టార్గెట్‌ చేస్తే.. అంతగా దృఢంగా మారుతామన్నారు. వారు మరింత దూకుడుగా తమకు విమర్శలు సాగించాలని కోరుకుంటున్నానని.. ఇలా చేసిన వారిని తాను గురువులుగా భావిస్తున్నానంటూ తెలిపారు.

ఇటీవల భద్రతా ఉల్లంఘనల వ్యవహారంపై కూడా రాహుల్ స్పందించారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో వెళ్లాలని హోమంత్రిత్వశాఖ చెబుతోంది. అలా ఎలా చేయగలనంటూ ప్రశ్నించారు. కారులో యాత్ర ఎలా చేస్తాం.. కాలినడకనే వెళ్లాలి.. అప్పుడు కూడా భద్రత ఎలా ఇవ్వాలో వారికి తెలుసు.. కావాలనే వారంతా రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఏ కారణం లేకపోవడంతో భద్రతా నిబంధనల ఉల్లంఘన పేరుతో కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ప్రపంచంలోని టాప్ 10 సెంట్రల్ బ్యాంకుల కంటే మనదేశంలో ఎక్కువ బంగారం
ప్రపంచంలోని టాప్ 10 సెంట్రల్ బ్యాంకుల కంటే మనదేశంలో ఎక్కువ బంగారం
దారుణం.. సంతానం కోసం నరబలి.. కొడుకు పుట్టాలని వృద్ధుడి తలతో..
దారుణం.. సంతానం కోసం నరబలి.. కొడుకు పుట్టాలని వృద్ధుడి తలతో..
ఈ టాలీవుడ్ బ్యూటీని గుర్తు పట్టారా? ఈమె భర్త పవర్ ఫుల్ విలన్
ఈ టాలీవుడ్ బ్యూటీని గుర్తు పట్టారా? ఈమె భర్త పవర్ ఫుల్ విలన్
యమునా నది పరిశుభ్రతకే ప్రాధాన్యతః సీఎం రేఖా
యమునా నది పరిశుభ్రతకే ప్రాధాన్యతః సీఎం రేఖా
Video: ఒరేయ్ ఆజామూ.. గల్లీ ప్లేయర్‌ల కంటే దారుణంగా ఉన్నారేంది
Video: ఒరేయ్ ఆజామూ.. గల్లీ ప్లేయర్‌ల కంటే దారుణంగా ఉన్నారేంది
ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ఉగాదిని సెలబ్రేట్ చేయండి ఇలా..!
ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ఉగాదిని సెలబ్రేట్ చేయండి ఇలా..!
మీ మొబైల్‌ను ఎవరైనా దొంగిలించారా? ముందుగా ఈ 3 పనులు చేయండి..!
మీ మొబైల్‌ను ఎవరైనా దొంగిలించారా? ముందుగా ఈ 3 పనులు చేయండి..!
ఖతర్నాక్ దంపతులు.. కాసుల కోసం భలే యాపారం సెట్ చేశారు.. కానీ
ఖతర్నాక్ దంపతులు.. కాసుల కోసం భలే యాపారం సెట్ చేశారు.. కానీ
ఉగాది రోజున పంచాంగం ఎందుకు చూస్తారు..?
ఉగాది రోజున పంచాంగం ఎందుకు చూస్తారు..?
కోరిన కోర్కెలు తీర్చే దేవుడు..! అబ్బాయిలు, అమ్మాయిలుగా వస్తేనే..
కోరిన కోర్కెలు తీర్చే దేవుడు..! అబ్బాయిలు, అమ్మాయిలుగా వస్తేనే..